బట్టలు విప్పుకొని తిరిగితేనే స్వాతంత్రమా? దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్

Divvela Madhuri: దివ్వెల మాధురి.. గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గుర్తింపు పొందిన దివ్వెల మాధురి. తక్కువ సమయంలోనే తన దూకుడు స్వభావంతో 'ఫైర్ బ్రాండ్'గా పేరు సంపాదించింది. హౌస్‌లో కేవలం మూడు వారాలే ఉన్నప్పటికీ ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్ చూపింది. తాజాగా యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరించే కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు మాధురి. మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన షాకింగ్ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏమన్నారు?

ఈ టాక్ షోలో మొదట తిరుపతిలో జరిగిన బిగ్ బాస్ తనుజ పుట్టినరోజు వేడుకల వివాదం గురించి మాట్లాడుతూ.. తనుజ బర్త్ డే . అందర్నీ వదిలి నా దగ్గరికి వచ్చిందని నేనే దగ్గరుండికే కేకు కట్ చేయించాను. దానిని పెద్ద వివాదంగా మార్చారు. దానిపై క్షమించమని డిమాండ్లు వచ్చాయి కదా అని ప్రశ్నించగా.. అందులో నేను ఏ తప్పు చేయలేదు నేను ఎవరికీ క్షమాపణ చెబుతూ వీడియోలు చేయలేదు. ఆ విషయంలో నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు క్షమాపణ చెప్తాను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ ముక్కుసూటిగా సమాధానం ఇచ్చింది.

Divvela Madhuri Shocking Comments on Women Dressing in Varsha Kissik Talk Show

ఇక డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకు లిమిట్ ఉండాలా? అని ప్రశ్నించగా.. దీనికి దివ్వెల మాధురి సమాధానమిస్తూ. కచ్చితంగా 100% లిమిట్స్ ఉండాలి. అంటే డ్రెస్సింగ్ వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయా అని ప్రశ్నించగా..'బట్టలు విప్పి తిరుగుతూనే స్వసంత్రం అని భావిస్తున్నారా? అది ఏమాత్రం సరైనది కాదు. ఎవరైతే ఇండిపెండెంట్గా ఆర్థికంగా ఎదుగుతూనే అది మీకు స్వతంత్రం వచ్చినట్లు.. కానీ బట్టలు విప్పుకొని తిరుగుతే స్వతంత్రం వచ్చినట్లు కాదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని ఈమధ్య చాలామంది అభిప్రాయపడుతున్నారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా.. మాధురి సమాధానమిస్తూ 'ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు జరుగుతే బాగుంటుంది. కానీ కాస్త సెటిల్ అయ్యాక చేసుకుంటే ఆ బంధం మరింత బాగుంటుంది. నా లైఫ్ లో నేను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్న. నేను ముందు నుండి ఆర్థికంగా సెట్టిల్డ్. పెట్రోల్ బంక్ రన్ చేశాను . రియల్ ఎస్టేట్ చేశాను. తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను' అని తెలిపారు.

ఇక రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు. 'మహిళలు రాజకీయాల్లోకి వస్తే వారిపై విమర్శలు, నెగటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.బురద చల్లుతారు. కొంతమంది నాయకులు రెండు పెళ్లిళ్లు చేసుకున్నా ప్రశ్నించరు. కానీ నేను చేస్తే మాత్రం టార్గెట్ చేస్తున్నారు" అంటూ తనపై జరిగిన విమర్శలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇంటర్వ్యూలో చివరగా అడిగిన ప్రశ్నకు మాధురి ఎమోషనల్‌గా స్పందించింది. 'దేవుడు ప్రత్యక్షమై కోరిక అడిగితే.. నా జీవితంలో కొన్ని విషయాలు మరోలా జరిగి ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ నాకు పెద్ద కోరికలు లేవు. ఈసారి మా ఆయన ఎమ్మెల్యే అయితే అదే నాకు సంతోషం'అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. మొత్తానికి, దివ్వెల మాధురి మరోసారి తన స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్, బోల్డ్ అభిప్రాయాలతో వార్తల్లో నిలిచింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X