హాట్ బ్యూటీతో సుడిగాలి సుధీర్ రొమాన్స్.. SS4లో తమిళ హీరోయిన్.. డైరెక్టర్ ఎవరంటే?

మ్యాజిక్ షోలు చేసుకుంటూ సెలబ్రిటీలను అట్రాక్ట్ చేసిన సుడిగాలి సుధీర్ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఇక ఈ షోలో యాంకర్ రష్మీతో లవ్ ట్రాక్ రూమర్స్ కారణంగా మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇప్పుడు సుడిగాలి సుధీర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనేంతలా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సుధీర్ హీరోగా ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా చేయనున్నాడు. ఇందులో తమిళ హాట్ బ్యూటి సుధీర్ సరసన నటించనుంది.

Divya Bharathi In Sudigali Sudheer Naresh Kuppili SS4 Movie

కామెడీ టైమింగ్: బుల్లితెరపైన తనదైన కామెడీ విపరీతంగా అట్రాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన కామెడీ షో జబర్ధస్త్ ద్వారా పరిచయమైన సుధీర్.. సుడిగాలి సుధీర్ గా మారి అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ తనదైన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తోపాటు అప్పుడప్పుడు డ్యాన్స్ లతో అదరగొట్టేశాడు.

Divya Bharathi In Sudigali Sudheer Naresh Kuppili SS4 Movie

ఒక హీరోగా: ఇటు బుల్లితెరపై తనదైన శైలీలో ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు సుడిగాలి సుధీర్. ఈ క్రమంలోనే త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు చేశాడు. సుడిగాలి సుధీర్ మొదట్లో హీరోగా చేసిన త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్ అంతగా హిట్ కాలేదు. తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ లో ఒక హీరోగా చేశాడు.

Divya Bharathi In Sudigali Sudheer Naresh Kuppili SS4 Movie

స్టార్ డమ్ కోసం: ఈ చిత్రాల తర్వాత గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయగా మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు అందరూ మెచ్చేలా స్టార్ డమ్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు సుడిగాలి సుధీర్.

Divya Bharathi In Sudigali Sudheer Naresh Kuppili SS4 Movie

హై బడ్జెట్ మూవీ: సుధీర్ తన తర్వాతి సినిమాను ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ డైరెక్టర్ దశరథ్ తో చేస్తున్నట్లుగా వార్తలు తెగ హల్ చల్ చేశాయి. హై బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడతోపాటు మరో హీరోయిన్ నటిస్తుందని టాక్ నడిచింది. ఇదిలా ఉంటే సుధీర్ మరో సినిమాతో కూడా రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

హాట్ బ్యూటి: సుడిగాలి సుధీర్ కెరీర్ లో SS4గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ హాట్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. బ్యాచ్ లర్ మూవీతో ఘాటు రొమాన్స్ పండించిన ఈ భామ త్వరలో సుధీర్ కు జోడీ కట్టనుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. తమిళ మూవీ బ్యాచ్ లర్ తో దివ్య భారతో తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది.

పూజా కార్యక్రమాలు: ఇదిలా ఉంటే మహాతేజ క్రియేషన్స్, లక్కీ మీడియా సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన ఇంతకుముందు విశ్వక్ సేన్ హీరోగా చేసిన పాగల్ మూవీని డైరెక్ట్ చేశాడు. హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోలో శుక్రవారం మే 12న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X