దర్శకుడితో రాత్రి గడిపితేనే ఆఫర్.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన సీరియల్ నటి!

సినీ ఇండస్ట్రీని ఎప్పటినుంచో భయపెడుతున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. అవకాశాల పేరిట కొందరు దర్శకనిర్మాతలు మహిళలను లైంగికంగా వేదిస్తారనే టాపిక్ ఎప్పటినుంచో వింటున్నాం. ఎందరో హీరోయిన్లు కూడా ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడారు. దీనిపై మీటు లాంటి ఎన్నో ఉద్యమాలు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి దహియా ఇదే విషయమై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

బుల్లితెర నటిగా క్రేజ్:హిందీ సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి.. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడిందట. అప్పట్లో సర్వైవల్ కోసం చిన్న చిన్న పనులు చేసి బతుకు వెళ్లదీసేదట. మనుగడ కోసం టూత్ పేస్ట్ పెట్టెలను సేకరించి అమ్మేదట. అలా అలా లైఫ్ లీడ్ చేస్తూ వచ్చానని ఆమెనే స్వయంగా తెలిపింది.

Divyanka Tripathi Dahiya Opened about casting couch in Film industry

డబ్బు సంపాదన మార్గం:డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోక తప్పదు. కెరీర్ తొలినాళ్లలో చాలామంది తనను లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించారని చెబుతూ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా రకాలుగా తను ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించింది. మీటూ కన్నా ముందే తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని తెలిపింది దివ్యాంక.

డైరెక్టర్‌తో ఆ రాత్రి:ఒకానొక సమయంలో సరైన ఆఫర్లు రాక, చేతిలో డబ్బుల్లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఓ ఆఫర్‌ వచ్చిందని, అయితే తీరా అక్కడకి వెళ్ళాక.. నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా గడిపితే నీకు మంచి అవకాశం ఇస్తాడని ఒక వ్యక్తి చెప్పడంతో షాక్ అయ్యానని దివ్యాంక త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఇలాంటి వారు వాళ్లు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉంటారని, వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.

Divyanka Tripathi Dahiya Opened about casting couch in Film industry

బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్:ప్ర‌తిభ‌ను న‌మ్ముకుంటేనే అవ‌కాశాలు వ‌స్తాయని చెబుతోంది దివ్యాంక త్రిపాఠి. హిందీ సీరియల్స్ లో యే హై మొహబ్బతేన్ సీరియల్‌తో ఆమె ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్‌లో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X