ఆ నటికి రాత్రయితే బెల్ కొట్టినట్లే... ప్రెగ్నెంట్ అయినా భర్తతో అలా..

బాలీవుడ్ స్టార్ కపుల్ దివ్యాంక త్రిపాఠి- వివేక్ దాహియాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీ కపుల్‌గా వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లో ఉంటారు. ఇంట్లో ఎలాంటి వేడుక అయినా సరే ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయాలను పంచుకుంటారు. పెళ్లయి పదేళ్లు కావొస్తున్నా ఈ జంటకు పిల్లలు లేకపోవడంతో ఎన్నో అవమానాలు పడ్డారు. అయితే తెలుగు సంవత్సరాదికి ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దివ్యాంక.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన దివ్యాంక త్రిపాఠి.. ఆల్ ఇండియా రేడియోలో యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 2003లో ప్యాంటీన్ జీ టీన్ క్వీన్ 2003 టైటిల్ గెలిచారు. అనంతరం మోడల్‌గా పనిచేసిన దివ్యాంక.. దూరదర్శన్‌లో ఆకాష్ వాణి అనే షోని అద్భుతంగా నిర్వహించారు. 2005లో స్టార్ ఒన్‌ ఛానెల్‌లో ప్రసారమైన యే దిల్ చాహే మోర్‌తో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టారు. బానావ్ మైనే తేరీ దుల్హాన్, మిసెస్ అండ్ మిస్టర్ శర్మ అలహాబాద్‌వాలే తదితర సీరియల్స్‌లో నటించారు. ఈ ఫేమ్‌తో దివ్యాంకకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. పలు చిత్రాలలో, వెబ్ సిరీస్‌లలో ఆమె నటించారు.

Divyanka Tripathi Pregnancy Vivek Dahiya s Sweet Midnight Cravings Gesture Goes Viral

తనతో బానావో మైనే తేరీ దుల్హాన్‌ సీరియల్‌లో తనతో పాటు కలిసి నటించిన శరద్ మల్హోత్రాతో దాదాపు 8 ఏళ్లపాటు డేటింగ్ చేశారు దివ్యాంక. రేపో మాపో పెళ్లి అనగా వీరి బంధానికి గుడ్‌బై చెబుతూ 2015లో ఈ జంట విడిపోయింది. 2016లో యే హై మొహబ్బతిన్‌లో తన సహా నటుడు వివేక్ దాహియాతో ప్రేమలో పడ్డారు దివ్యాంక. అనంతరం భోపాల్‌లో జూలై 8, 2016లో ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. తన నటనకు గాను ఐటీఏ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, గోల్డ్ అవార్డ్స్‌తో పాటు 2017లో ఇండియాలో 100 మంది సెలబ్రిటీస్ లిస్ట్‌లో దివ్యాంక చోటు దక్కించుకున్నారు.

వివేక్ దాహియాతో వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతూ బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకరిగా నిలిచారు. అయితే పెళ్లయి దాదాపు 10 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు పిల్లలు లేకపోవడంతో ఈ దంపతులు ఎంతో కుమిలిపోయారు. ఎట్టకేలకు వీరి ఆశలు ఫలించి దివ్యాంక త్రిపాఠి గర్భం దాల్చారు. 41 ఏళ్ల వయసులో తల్లి కానుండటంతో దివ్యాంక- వివేక్‌ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. భార్యను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆమెను ఆనందంగా ఉంచుతున్నారు వివేక్. ఇటీవల ఈ జంట షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రెగ్నెంట్ అయినవారికి సహజంగానే ఏదో ఒకటి తినాలపిస్తుంది. తనకు కూడా సాయంత్రం అయ్యే సరికి స్వీట్స్ లేదా మరేదైనా తినాలనే కోరికలు మొదలవుతాయని దివ్యాంక చెప్పారు. ఇంతలో వివేక్ జోక్యం చేసుకుని సాయంత్రం ఆమె ఛాట్ తింటూ కనిపించింది. ఇప్పుడేమో అర్ధరాత్రి వేళ మంచి స్వీట్స్ కోసం బయట తిరుగుతున్నామని చెప్పాడు. సుదీర్ఘ అన్వేషణ తర్వాత.. ఎట్టకేలకు కాసేపట్లో మూసివేస్తారనగా ఓ ఐస్‌క్రీమ్ దుకాణాన్ని కనుగొన్నామని తెలిపారు. ఆ వెంటనే తమ వాహనాన్ని ఆపి, గిన్నె నిండా ఐస్‌క్రీమ్ కొని భార్య కోరికను తీర్చారు వివేక్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తల్లి కాబోతున్నా నీ భార్యలో చిన్న పిల్ల లక్షణాలు పోలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X