Bigg Boss Telugu 7: బిగ్ బాస్‌లోకి స్పెషల్ గెస్టులు.. కంటెస్టెంట్లకు బిగ్ సర్‌ప్రైజ్, పండగంటే ఇదబ్బా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. రోజురోజుకూ అదిరిపోయే ట్విస్టులు, అంతకు మించిన ఎమోషన్లు పండేలా బిగ్ బాస్ టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే పదో వారంలో భాగంగా ఫ్యామిలీ వీక్ నిర్వహించిన బిగ్ బాస్ టీం ఈ సండేను మరింత అందంగా మలిచారు. ముఖ్యంగా దీపావళి పండుగ కావడం అందులోనూ ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్లు ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి రావడంతో మరింత స్పెషల్ అయింది. ఈక్రమంలోనే బిగ్ బాస్ టీం అందరినీ బిగ్ బాస్ స్టేజీపైకి తీసుకొచ్చి పండుగ అంటే ఇలా ఉండాలి అనేలా చేశారు. ఇదంతా ఈరోజు విడుదల అయిన ప్రోమో చూస్తుంటే అర్థం అయిపోతుంది.
ఆరెంజ్ కలర్ ట్రెండీ వేర్ లో నాగార్జున అద్భుతమైన డ్యాన్స్ తో ఎంట్రీ ఇవ్వగా... ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, వైష్ణవ్ తేజ్ కనిపించారు. ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన స్టేజీ మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా వచ్చారు. అలాగే కాజల్ అగర్వాల్ కూడా బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. ఆమె కూడా ఏదో సినిమా ప్రమోషన్ లో భాగంగానే వచ్చినట్లు అర్థం అవుతంది. పండుగ సందర్భంగా కంటెస్టెంట్లు అంతా ఎత్నిక్ వేర్స్ వేసుకొని చాలా స్టైలిష్ గా ముస్తాబు అయ్యారు.

నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే.. ముందుగా హౌస్ మేట్స్ తో దాగుడు మూతలు ఆడారు. ఆ తర్వాత అదిరిపోయే లుక్ లో కనిపించి మరీ కంటెస్టెంట్లకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత దీపావళి సందర్భంగా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులతో పాటు వారి స్నేహితులను పిలుస్తున్నట్లు చెప్పారు. ఇందుకు కంటెస్టెంట్లు అంతా ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ముందుగా మానస్, అమర్ దీప్ వాళ్ల అమ్మ, ఆ తర్వాత గౌతమ్ సోదరుడు ఆయన స్నేహితుడు, డైరెక్టర్ బుచ్చిబాబు, అర్జున్ స్నేహితుడు వచ్చారు. సోహెల్ తో పాటు మరో వ్యక్తి వచ్చారు. ఆ తర్వాత ప్రగతి, ఇంకొరుకు వచ్చారు. వీరిద్దరూ ప్రియాంక కోసం వచ్చినట్లు ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది.
అర్జున్ కు బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్: అలాగే ప్రిన్స్ యావర్ కోసం కమెడియాన్ ఇమాన్యుయేల్, యావర్ స్నేహితుడు వచ్చారు. ఈక్రమంలోనే నాగార్జున ఇమ్ముతో ఫుల్ కామెడీ చేశాడు. సార్ నాక తెలుగు రాదు, వాడికి హిందీ ఇంగ్లీష్ రాదు అటూ చెప్పడంతో నవ్వులు పూశాయి. అమర్ దీప్ వాళ్ల నాన్న గురించి తల్లిని అడగ్గా.. నాన్న నువ్వు కప్పు కొట్టుకుని వచ్చేదాకా హైదరాబాద్ రానన్నారు అని చెప్పగా అమర్ దీప్ మురిసిపోయాడు. గౌతమ్ కృష్మ అంటే 2.0 అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు.. అంబటి అర్జున్ కు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పాడు.
ఆ తర్వాత వచ్చిన సోహెల్ తాను బిగ్ బాస్ నుంచి ఇంకా ఎలిమినేట్ కాలేనని చెప్పడంతో అంతా నవ్వారు. సూట్ కేస్ పట్టుకుపోయినోడికి ఎలిమినేషన్ ఏముంది అంటూ నాగ్ వేసిన డైలాగ్ అదిరింది. పెళ్లయ్యాక హ్యాపీ ఉండదు అని అంబటి అర్జున్ అనగా.. అమ్మా సురేఖ విను అంటూ నాగ్ చెప్పగా అంతా ఘొల్లుమన్నారు. ఆ తర్వాత మానస్.. అమర్ దీప్ ఎవరికీ భయపడకురా.. మీసం తిప్పు అని చెప్పగా అమర్ దీప్ మీసం తిప్పాడు. శివాజీ కొడుకు స్టేజీ మీదకు రాగా.. శివాజి ఫుల్ ఖుషీ అయ్యాడు. ఈక్రమంలోనే శివాజి కొడుడు భోలె అన్నా అనగా.. ఆయన బాబాయ్ రా అంటూ రిక్కీ చెప్పాడు. లేదు ఆయన హీరో అన్నా అంటూ రిక్కీ చమత్కరించాడు.
ఆ తర్వాత వెంటనే శోభా ఆంటీ అంటూ చేసిన కామెంట్లు మరింత హైలెట్ గా నిలిచాయి. ఆ తర్వాత శివాజి భార్య నన్ను చూడవా అని అడగడం, రిక్కీయేమో.. నువ్వు ఎంత పెద్ద హీరోవో నాకు తెలియదు కానీ ఈరోజు శివన్నగా అందరి ఇంట్లో ఉన్నావు చెప్పగా.. శివాజి ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఇంకోసారి నీ నోట్లోంచి వస్తా అన్న మాట రావద్దు అంటే నాగార్జున నీ కొడుకు నీకే సలహాలు ఇచ్చే స్థాయికి వచ్చాడని చెప్పగా.. శివాజి అవును సార్ అంటూ నవ్వాడు. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ప్రోమోలో చివరగా... కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత టాప్ 5లో ఎవరు ఉంటారు అనగా.. ఎక్కువగా శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్ ఫొటోలు పెట్టారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











