వీడియో: ఈ యుగానికే ఆమె ఇడియట్.. నటిపై దుమ్మెత్తి పోసిన నెటిజన్స్, పసిపాపని అలా!
Recommended Video

ఈ సోషల్ మీడియా యుగంలో సెలెబ్రిటీలు ఏం చేసినా వెంటనే తెలిసిపోతోంది. సెలెబ్రిటీల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి సర్కులేట్ అవుతున్నాయి. తమ విశేషాలని అభిమానులతో పంచుకోవడానికి ఎక్కువ మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు. టెలివిజన్ నటి దీపికా సింగ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వలన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తన సోదరి కుమార్తె విషయంలో దీపికా సింగ్ చేసిన పొరపాటు వలన విమర్శలు ఎదురవుతున్నాయి. పైగా దీపికా సింగ్ తాను చేసిన పనిని సమర్థించుకుంది.

టెలివిజన్ నటిగా
దీపికా సింగ్ టివి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దివ్య ఔర్ బాటి హమ్ టివి సిరీస్ తో దీపికా సెలేబ్రిటిగా మారింది. ప్రస్తుతం దీపికా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తోంది.
దీపికా చేసిన తప్పిదం
పసి పాప అయిన తన సోదరి కుమార్తెతో సరదాగా గడుపుతున్న దీపికా ఓ పొరపాటు చేసింది. తన సోదరి కుమార్తె యోషికకు లిప్ స్టిక్ రాసింది. ఆ వీడియోని సోషల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. లిప్ స్టిక్ రాసిన అనంతరం యోషికకు ఆహార పదార్థం ఇస్తే తినలేదు. దీనిని బట్టి ఆడవాళ్లు ఆహారం కంటే లిప్ స్టిక్ నే ఎక్కువగా ఇష్టపడతారు అంటూ కామెంట్ కూడా పెట్టింది.

యుగానికే ఇడియట్
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దీపికపై విమర్శలు చేస్తున్నారు. దీపిక ఈ యుగానికే ఇడియట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అసలు లిప్ స్టిక్ 10 ఏళ్ల లోపు చిన్నారులకు ఉపయోగించకూడదు. ఇలాంటి పసిపిల్లకు లిప్ స్టిక్ ఉపయోగించడం ప్రమాదకరం. వారికి ఏమి తెలియదు కనుక మింగేసే అవకాశం ఉంది అని అతడు ఘాటుగా స్పందించాడు.

నోరు అదుపులో పెట్టుకో
అతడి స్పందనకు దీపిక కూడా అదే రేంజ్ లో బదులిచ్చింది. మొదట నీ నోరు అదుపులో పెట్టుకో. కేవలం 30 సెకండ్ల వీడియోతో మనుషులని జడ్జ్ చేయవద్దు. నేను తల్లిని. పిల్లలని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నేను రాసిన లిప్ స్టిక్ ప్రమాదకరమైంది కాదు అని దీపిక బదులిచ్చింది.


Click it and Unblock the Notifications











