భర్తను వంచించిన సీరియల్ నటి.. 25 లక్షలు కాజేసి మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకొన్న యాక్టర్ ఎవరంటే?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల వైవాహిక జీవితం అనేది ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతుంది. చాలా మంది సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తూ.. బతికేస్తున్నారు. తాజాగా మరో ఘటన బయటకు వచ్చింది. తన భార్య ( ప్రముఖ సీరియల్ హీరోయిన్) తనను మోసం చేసిందని మీడియాను ఆశ్రయించాడు ఓ భర్త. తన వద్ద పాతిక లక్షలు కాజేసి వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని ఆరోపణలు చేశారు. అసలు ఆ హీరోయిన్ ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో చూసేద్దాం.

ప్రముఖ టీవీ సీరియల్ హీరోయిన్ అడ్డాల ఐశ్వర్య గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. అయితే ఆమె పేరు తెలియక పోవచ్చు కానీ... సీరియల్లో ఆమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆమె ఒకటా రెండా.. అనేక సీరియల్లలో నటిస్తుంది. ఒక్క ఛానెల్ అని కాదు.. ఈటీవీ, మాటీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు.. ఇలా తెలుగు ప్రధాన ఛానెల్లలో ప్రసారం అయ్యే సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి పాపులారిటీ సొంతం చేసింది.

Do you know a serial heroine who cheated on her husband and had an Affair with another person

స్టార్ మా టీవీలో ప్రసారం అయ్యే పలుకే బంగారామాయేనా అనే సీరియల్లో ఐశ్వర్య ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అంతే కాదు.. జీ తెలుగులో అమ్మాయి గారు అనే సీరియల్లో, ఈటీవీలో అత్తారింటికీ దారేది అనే సీరియల్ లో, జెమినీ టీవీలో అలా వైకుంఠపురం అనే సీరియల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తుంది. సీరియల్స్ ద్వారా బిజీ బిజీగా ఉండే ఈ బ్యూటీ మీద ఆమె భర్త పలు ఆరోపణలు చేశారు. అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.

అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని తన భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించాడు. అనంతరం తన బాధను చెప్పుకుని ఆవేదన చెందాడు. పెళ్లయిన తర్వాత తన వద్ద రూ.25 లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని మీడియా ముందు తన భార్యపై ఆరోపణలు చేశాడు. వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని వెల్లడించాడు.

తనకు న్యాయం చేయాలని బాధిత భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను అభ్యర్థన చేశాడు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై అతని భార్య ఐశ్వర్య కూడా స్పందిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయంపై తన భార్య ఐశ్వర్య స్పందిస్తుందో లేదో చూడాలి.

Do you know a serial heroine who cheated on her husband and had an Affair with another person

ఇక వీరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల ఐశ్వర్య పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కాపు మ్యాట్రిమోనీ ద్వారా సీరియల్ నటిని పిన్నింటి శ్యాం కుమార్ వివాహం చేసుకున్నాడు. జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్ లో అడ్డాల ఐశ్వర్య నటిగా కొనసాగుతోంది. సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా ఐశ్వర్య నటించింది.

అయితే పెళ్లి అయినా నెల రోజుల తర్వాత ఐశ్వర్య అక్రమ సంబంధం బయటపడిందని భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబు తో వివాహేత సంబంధం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతుందంటూ మీడియా ముందు వెల్లడించాడు. మరి వీడిపై నటి స్పందిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X