Bhagavanth Kesari: భగవంత్ కేసరిలో రతికా రోజ్... 5 నిమిషాలకే అంత ఛార్జ్ చేసిందా?

బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్లిందో.. అక్కడ ఆమె ప్రవర్తనతో ఒక్కసారిగా నెగిటివిటీ తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఈ బ్యూటీ మళ్లీ ఈరోజు బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ విషయం పక్కన పెడితే ఇటీవల ఈ భామ బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. దాంతో ఈ భామ మరింత ఫేమస్ అయిపోయింది. ఇక ఆమె రెమ్యూనరేషన్ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక అందులో ఓ కంటెస్టెంట్ గా రతికా రోజ్ ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన మొదటి రోజు నుంచి ఈ భామ అందరినీ ఆకట్టుకుంది. ఇక హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. పల్లవి ప్రశాంత్ తో కలిసి హౌస్ లో లవ్ ట్రాక్ మొదలు పెట్టింది. ఆ తర్వాత రెండో వారంలో ప్రశాంత్ కు ఎదురు తిరిగి షాక్ ఇచ్చింది. ఇక మూడో వారంలో వాళ్లు మాటలు కలిపి మళ్లీ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్, రతికా రోజ్ బద్ద శత్రువుల్లా మారిపోయారు.

 Do you know Bigg Boss Beauty Rathika Rose Remuneration in Balayya Bhagavanth Kesari Movie?

ఇక ప్రశాంత్ పవర్ అస్త్ర సాధించే క్రమంలో రతికారోజ్ హద్దు మీరు మాట్లాడింది. ఇంట్లో వాళ్లను తిడుతూ ప్రశాంత్ పై విరుచుకుపడిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా నెగిటివిటీ పెరిగిపోయింది. దీంతో నాలుగో వారంలో అందరికీ షాక్ ఇస్తూ ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఎలిమినేట్ అయిపోయినా.. ఆమె ఫేం మాత్రం తగ్గలేదు. మళ్లీ ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకువచ్చేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఎట్టకేలకు రతికా రోజ్ ఈరోజు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఇంత కాంట్రవర్సీల తర్వాత మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టాకా... రతికా రోజ్ ఎలా ఉండనుందని అంతా అనుకుంటున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. రతికా రోజ్ ఇటీవల ఓ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో రతికా రోజ్ చిన్న పాత్రలో నటించింది. ఐదు నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తుంది.

 Do you know Bigg Boss Beauty Rathika Rose Remuneration in Balayya Bhagavanth Kesari Movie?

భగవంత్ కేసరి సినిమాలో రతికా రోజ్ మంత్రి పాత్రలో కనిపించింది. కళ్లజోడు పెట్టుకుని.. శారీ కట్టుకుని ఉంటుంది. ఇక ఈమె పాత్రపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరో న్యూస్ ఏంటంటే... రతికా రోజ్ .. భగవంత్ కేసరి సినిమా కోసం భారీగా ఛార్జ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఐదు నిమిషాల పాత్ర కోసం.. ఐదు లక్షలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం అంత లేదు.. కేవలం లక్ష ఇచ్చి ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.

 Do you know Bigg Boss Beauty Rathika Rose Remuneration in Balayya Bhagavanth Kesari Movie?

ఏది ఏమైనా బాలయ్య సినిమాలో రతికా రోజ్ కనిపించడం.. నెట్టింట మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇక రతికా రోజ్ సినిమాల్లో హీరోయిన్ అవుదామని వచ్చింది. కానీ సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతుంది. ఇంతకు ముందు బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది, తుపాకీ రాముడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రతికాకు అవకాశం వచ్చిందని అంటున్నారు. చూడాలి ఇక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X