Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ముద్దుబిడ్డగా మారిపోయిన ప్రియాంక జైన్... ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో అందమైన అమ్మాయి ఎవరైనా ఉందంటే ప్రియాంక జైన్. తన అందం, క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ వంటలక్కగా పేరు తెచ్చుకున్న ఈ భామకు.. ఇటీవల బిగ్ బాస్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. అంతే కాదు.. టాప్ 5లో పెట్టేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న కెప్టెన్సీ టాస్కులోనూ అమర్ కు అన్యాయం చేసి మరీ... ప్రియాంకను గెలిపించాడు. అలా నెక్ట్స్ వీక్ కూడా సేవ్ అయ్యేలా బిగ్ ప్లాన్ వేశాడు బిగ్ బాస్. అయితే దీని వెనుకలా ఓ పెద్ద విషయమే ఉందని తెలుస్తోంది. ఇంతలా ప్రియాంకను వెనకేసుకు రావాడానికి కారణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జానకీ కలగనలేదు.. మౌనరాగం సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జైన్. ఇక తన క్యూట్ లుక్స్, అందంతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్ లో కలిసిపోయిన ఈ క్యూటీ... టాప్ 5 నిలవడం ఖాయం అని అంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదట విడుతలోనే అడుగుపెట్టిన ఈ భామ.. మొదటి నుంచి వంట రూమ్ కు పరిమితం అయి.. అందరికీ వంట చేసిపెడుతుంది. అంతే కాదు.. బీబీ వంటలక్కగా గుర్తింపు తెచ్చుకుంది.

Do You Know Bigg Boss Support to Priyanka Jain in Bigg Boss Telugu 7

బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది రతికా రోజ్. ఎందుకంటే.. ఆమె నాలుగవ వారంలో ఎలిమినేట్ అయిపోయింది. అయినా ఆమె కోసం.. ఓ కొత్త డ్రామా ఆడి.. రీఎంట్రీ ఇప్పించాడు. రెండో అవకాశం వచ్చినా.. ఆమె దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇక అంతకు ముందు కంటే ఘోరంగా ఆడుతూ విమర్శల పాలవుతుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కూడా రతికా రోజ్ కు బాగానే క్లాస్ ఇచ్చాడు నాగార్జున.

Do You Know Bigg Boss Support to Priyanka Jain in Bigg Boss Telugu 7

అయితే ప్రియాంక ఇప్పుడు బిగ్ బాస్ ముద్దు బిడ్డగా మారిపోయింది. మొన్నటి కెప్టెన్సీ టాస్కులో అమర్ దీప్ ను వాళ్లు టార్గెట్ చేశారని తెలిసినా.. సైలెంట్ అయిపోయాడు. అంతే కాదు.. అమర్ బ్రిక్స్ కిందపడేదాకా చూసి.. బజర్ ప్రెస్ చేశాడు బిగ్ బాస్. అలా మొత్తానికి ప్రియాంక జైన్ ను కెప్టెన్ గా చేశాడు బిగ్ బాస్. మొత్తానికి ఈ వారం ప్రియాంక జైన్ సెఫ్.. నెక్ట్స్ వారం కెప్టెన్సీ గా ఉంటుంది కాబట్టి ఆ వారం కూడా సెఫ్ అవుతుంది.

Do You Know Bigg Boss Support to Priyanka Jain in Bigg Boss Telugu 7

ఇక టాప్ 5లోకి పంపించాలని బిగ్ బాస్ ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కారణం ఆమెకు స్టార్ మాలో సీరియల్ ఆఫర్ ఉంది. ఆ సీరియల్ ప్రమోట్ కావాలంటే.. ఈ క్యూటీ ఎక్కువ ఫేమస్ అవ్వాలి. అంటే టాప్ 5లో పెట్టాలి. అలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. ప్రియాంక జైన్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఓ మంచి సీరియల్ ఆఫర్ ఉంది. లవర్ శివ కుమార్ హీరోగా.. ప్రియాంక హీరోయిన్ గా ఓ సిరియల్ ఉందని అంటున్నారు. అందుకే ఈ భామను కాపాడుకుంటున్నాడు బిగ్ బాస్. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X