Nagarjuna: బిగ్ బాస్ షోతో ఇప్పటివరకు నాగార్జున సంపాదన ఎన్ని కోట్లో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులను అలరించే షోల్లో బిగ్ బాస్ షో ఒకటి. అయితే ఈ షో మొదటి విదేశాల నుంచి.. మన ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత రీజినల్ లాంగ్వేజస్ కు చేరుకుంది. అయితే బిగ్ బాస్ తెలుగు 1 అండ్ 2 సీజన్స్ ఎన్టీఆర్, నాని హోస్టులుగా చేశారు. ఆ తర్వాతి సీజన్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వరకు అక్కినేని నాగార్జున హోస్టుగా చేస్తున్నారు. అయితే నాగార్జున బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసుకుందాం.

బుల్లితెర కార్యక్రమాలలో బిగ్ బాస్ షో కు భారీ క్రేజ్ పెరుగుతోందనే చెప్పాలి. అంతే విధంగా బిగ్ బాస్ షో పైన చాలా ట్రోల్స్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఇలాంటి రియాలిటీ షో వల్ల చాలామంది సెలబ్రిటీలు గా మారుతున్నాప్పటికీ... కొన్ని వివాదాల వల్ల బిగ్ బాస్ షోపై నెగిటివిటీ వస్తుంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వారికి కూడా బిగ్ బాస్ షోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Do you know how many crores Akkineni Nagarjuna earned with Bigg Boss show Full Details Here

మొదట ఈ రియాలిటీ షోని హిందీలో ప్రారంభించగ అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాతే మిగతా భాషలలో బిగ్ బాస్ షోను ప్రారంభించారు. అలా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ బిగ్ బాస్ రియాల్టీ షో... ఇప్పటి వరకు సీజన్ 7 పూర్తి చేసుకుంది. ఇక రెండో సీజన్ కు హోస్టుగా నేచురల్ స్టార్ నాని వ్యవహారించాడు. ఈ సిజన్ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు పూర్తి అయిన 7 వ సీజన్ వరకు నాగార్జున హోస్టుగా చేస్తున్నారు. అతి త్వరలోనే బిగ్ బాస్ ఓటిటి రెండవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అందుకు హోస్టుగా నాగార్జుననే వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇన్ని సీజన్లకు హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున బిగ్ బాస్ షోకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Do you know how many crores Akkineni Nagarjuna earned with Bigg Boss show Full Details Here

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం... బిగ్ బాస్ షో ద్వారా అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు రూ.140 కోట్లకు పైగానే సంపాదించారాని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ నెట్టింట, టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సినిమాలతో కంటే బిగ్ బాస్ షోల వల్లే నాగార్జున.. భారీగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ కాన్సెప్ట్ తనకి ఇష్టం లేకపోయినా నాగార్జున పోస్టుగా వ్యవహరించడానికి.. రెమ్యూనరేషనే కారణమని అంటున్నారు.

నాగార్జున ఇకపై వచ్చే అన్ని సీజన్లకి హోస్టుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తుండగా... నాగార్జున హోస్టింగ్ కోసం కూడా చాలా మంది చూస్తున్నారట. ప్రస్తుతం నాగార్జున నా సామిరంగా అనే సినిమా చేస్తున్నాడు. కొరియోగ్రాఫర్ బెన్ని విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆషికా రంగానాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X