Bigg Boss Telugu 7: నాగార్జునను అమర్ దీప్ అడిగిన టీ షర్ట్ ఎన్ని లక్షలో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ఉల్టా పుల్టా సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. ఈ సీజన్ ఇప్పుడు దాదాపుగా మరో 6 రోజుల్లో పూర్తి కానుంది. ఇన్ని రోజుల ఈ సీజన్ లో అనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, షాకులు, ట్విస్టులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే రక్తికట్టించారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ధరించే దుస్తులు... ఆకట్టుకుంటున్నాయి. నిన్నటి ఎపిసోడ్ నాగార్జునను అమర్ దీప్ టీ షర్ట్ అడిగాడు. అయితే నాగార్జున ఆ టీషర్ట్ ఇవ్వలేదనుకోండి... కానీ ప్రసుత్తం ఆ టీ షర్ట్ ధర హాట్ టాపిక్ గా మారింది. ఆ టీ షర్ట్ ధర ఎంతో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
విపరీతమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్ తెలుగు ఒకటి. ఈ రియాలిటీ షో తెలుగులో మొదట 2017లో ప్రారంభం కాగా... తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఆరు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను నిర్వహించారు మేకర్స్.

బిగ్ బాస్ తెలుగు 1వ సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి... మెప్పించారు. రెండో సీజన్ ను నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసి.. క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈ రియాలిటీ షో పాపులర్ అవడంతో పాటు రేటింగ్ పరంగా కూడా దూసుకుపోయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున ప్రతి వారం కొత్త టీషర్ట్స్ తో దర్శనం ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే 64 ఏళ్లు పైబడినా కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫిట్ గా ఉంటారు. ఇక ఆయన డ్రెస్సింగ్ స్టైల్ వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. ఎలాంటి డిజైనర్ వేర్ వేసినా ఆయనకు సూట్ అయ్యేలా ఉంటుంది. ఇక బిగ్ బాస్ షోలో ఆయన వేసే దుస్తులు ప్రత్యేకంగా ఉంటున్నాయి. నాగార్జున కోసం స్పెషల్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వేసుకునే కాస్ట్యూమ్స్ పై, వాటి ధరపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆయన వేసుకునే రంగురంగుల, విచిత్రమైన దుస్తుల ఖరీదును గూగుల్ లో సెర్చ్ చేసి మరి కనుక్కుంటున్నారు నెటిజన్స్. ఆ దుస్తుల ధరలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వామ్మో వాటి ఖరీదు ఇంతనా అంటూ ఆశ్యర్యపోతున్నారు.
ఇక నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వేసుకున్న యెల్లో కలర్ టీషర్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక అమర్ దీప్ కూడా ఆ టీ షర్ట్ నాకు ఇవ్వండి సార్ అంటూ అడిగాడు. కానీ నాగార్జున మాత్రం కూర్చో అంటూ సీరియస్ గా చెప్పాడు. మరి ఈ సీజన్ అయ్యాక అయినా అమర్ దీప్ కోసం ఆ టీ షర్ట్ పంపిస్తారో లేదో తెలియదు కానీ... ఆ టీ షర్ట్ ధర మాత్రం ఓ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది. 14వ వారంలో నాగార్జున వేసుకున్న యెల్లో కలర్ టీ షర్ట్ ధర రూ.2 లక్షల 11వేల 600లకు పైగానే ఉందని తెలుస్తోంది. ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











