Bigg Boss Telugu 7 Winner బిగ్‌బాస్ విజేతకు 5000000 ప్రైజ్ మనీ.. విన్నర్‌కు ఎన్ని లక్షలు ముడుతాయో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు ఎండెమాల్ షైన్ ఇండియా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో కొన్ని గంటల్లో ఈ ఫినాలేను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఫినాలే సందర్భంగా జరిగే ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే అట్టహాసంగా జరిగే కార్యక్రమంలో విజేతకు ఇచ్చే బహుమతి ఎంత? అందులో విన్నర్‌కు ఎంత ఇస్తారనే విషయంలోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు వారం వారం రెమ్యునరేషన్ ఇవ్వడమే కాకుండా భారీ ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. విజేతగా నిలిచిన వారికి ట్రోఫితోపాటు ప్రైజ్ మనీ చెక్ కూడా అందజేస్తారు. అయితే షో నిర్వాహకులు ప్రకటించే బహుమతిలో విజేతకు అసలు ఎంత ముడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఇక ఎప్పటి మాదిరిగానే బిగ్‌బాస్ తెలుగు విజేతకు నగదు బహుమతితోపాటు స్పాన్సర్ల నుంచి బహుమతులు కూడా భారీగా ఉంటాయి. ఈ సారి విజేతకు ఓ నగల సంస్థ నుంచి విలువైన నెక్లేస్, అలాగే ఓ వాహన సంస్థ నుంచి కారు కూడా బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఇతర స్పాన్సర్ల నుంచి కూడా ఖరీదైన గిఫ్టులు, ఓచర్లు అందించే అవకాశం ఉంది.

ఇక బిగ్‌బాస్ తెలుగు 7 విజేతకు భారీ రెమ్యునరేషన్‌తోపాటు 5000000 రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నారు. అయితే విజేతకు ఈ మొత్తం ముడుతుందనుకొంటే పొరపాటే. ఎందుకంటే విన్నర్‌కు లభించే 50 లక్షల బహుమతిలో పన్ను విధింపు కూడా ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాలు విధించే పన్నుల తర్వాత వారికి వచ్చే మొత్తం 25 లక్షల కంటే తక్కువగానే ఉంటుంది.

గత బిగ్‌బాస్ తెలుగు విజేతలు అందుకొన్న నగదు బహుమతి మొత్తాన్ని చూస్తే.. 50 లక్షల్లో సగానికిపైగా మనీ ట్యాక్సులకే చెల్లించాల్సి వచ్చింది. అయితే ఎండెమాల్ షైన్ నిర్వాహకులు ట్యాక్స్ మొత్తం కట్ చేసిన తర్వాతే మిగిలిన మొత్తాన్ని విజేతకు అందిస్తారు. దాంతో అందరూ ఊహించినట్టు 50 లక్షలు ప్రైజ్ మనీ వారికి లభించదు అనేది గమనించాల్సిన విషయం.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 17వ తేదీన జరిగే బిగ్‌బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకు 6 గురు కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. తాజా అంచనాల ప్రకారం.. పల్లవి ప్రశాంత్ గానీ, శివాజీ గానీ విజేతలుగా నిలిచే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











