Bigg Boss బిగ్‌బాస్ హౌస్‌లో 3 రోజులకు 2 కోట్ల రెమ్యునరేషన్.. ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోలు జోరుగా నడుస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఇప్పటికే బిగ్‌బాస్ రియాలిటీ షోలు మొదలయ్యాయి. ఇక హిందీలో బిగ్‌బాస్ 17 సీజన్ మొదలు కాబోతున్నది. ఇలా పలు భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ల వివరాలు, అలాగే వారు తీసుకొంటున్న రెమ్యునరేషన్, ఇతర అంశాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకొన్న కంటెస్టెంట్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకొన్న సెలబ్రిటీల చాలానే ఉంది. కానీ అతి తక్కువ రోజులకు, భారీ రెమ్యునరేషన్ అందుకొన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. బిగ్‌బాస్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న ఆ సెలబ్రిటీకి ఎవరూ ఊహించనంత డబ్బును ముట్టజెప్పారు. ఇప్పటికే రికార్డును ఎవరూ అందుకోలేకపోవడం గమనార్హం.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్ 4 లోకి ఇంటర్నేషనల్ యాక్టర్, మోడల్ అడుగుపెట్టారు. కెనడా, అమెరికాకు చెందిన మోడల్, నటి పమెలా అండర్సన్ షోలోకి రావడం భారతీయ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ఆమె బిగ్‌బాస్ 4లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండేందుకు గెస్ట్‌గా వచ్చారు.
ఇంటర్నేషనల్ స్టార్, మోడల్‌గా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న పమేలా అండర్సన్ బిగ్‌బాస్ 14 షోలోకి రావడంతో ఆ షోకు రికార్డు స్థాయి టీఆర్పీ రావడం జరిగింది. అంతటి క్రేజ్ ఉన్న పమేలా అండర్సన్‌కు కేవలం మూడు రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నందుకు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారనేది అప్పట్లో మీడియాలో వైరల్ అయింది.

ఇక పమెలా అండర్సన్ విషయానికి వస్తే.. కెనడాలో జన్మించారు. ఆమె మోడల్‌గా కెరీర్ ఆరంభించి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ది టేకింగ్ ఆఫ్ బేవెర్లీ హిల్స్, స్నాప్ డ్రాగన్, నేకెడ్ సోల్స్, బేవాచ్ సిరీస్ లాంటి సినిమాల్లో నటించారు. అలాగే టెలివిజన్ విషయానికి వస్తే.. మ్యారీడ్ పీపుల్స్, బేవాచ్, 8 సింపుల్ రూల్స్, మ్యాచ్ గేమ్ లాంటి సిరీస్‌లో నటించారు. ఇంకా మ్యూజిక్ ఆల్బమ్, డాక్యుమెంటరీలలో నటించారు. బేవాచ్ మూవీకి పలు అవార్డులు అందుకొన్నారు.
ఇక బిగ్‌బాస్ సీజన్ 17 షో విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా రియాలిటీ షో అక్టోబర్ 15వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ షోను కలర్స్ టీవీ, జీ సినిమా యాప్‌లో టెలికాస్ట్ చేస్తారు. ఈ సీజన్‌కు దిల్, దిమాక్ ఔర్ దమ్ అనే టైటిల్‌ను పెట్టారు. ఈసారి షోలో దాదాపు 20 మంది కంటెస్టెంట్స్ ఉంటారనేది తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











