Remuneration: వసుధార రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? రక్ష గౌడ కళ్లు చెదిరే పారితోషికం!

బుల్లితెరపై టాప్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. హీరోలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో.. రిషి సార్ కు కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక రిషికే కాదు వసుధారకు అయితే అస్సలు చెప్పనవసరం లేదు. వసుధార మంచి నటనతో, ఈ సీరియల్లో తన అందం అభినయంతో, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

వసుధార అసలు పేరు రక్ష గౌడ. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మొదట పలు సీరియల్స్ తో అలరించింది. ఇక ఎప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ మొదలయ్యిందో అప్పటినుంచి ఈ చ్ఛిన్నాడని రేంజ్ మారిపోయిందని చెప్పాలి. వసుగా అమ్మడు.. అల్లరి, సీరియస్ నెస్, రిషితో గొడవలు.. ఆమె క్యారెక్టర్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Do you know how much raksha gowda takes remuneration for guppedantha manasu serial

ఇక పేరుకు తగ్గట్టే రక్ష రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటుందంట. ఒకప్పుడు టీవీ ఆర్టిస్ట్‌లంటే ఒకింత చిన్నచూపు ఉండేది.. కానీ, ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో సినిమా వాళ్లకి గట్టి పోటీగానే నిలబడుతున్నారు ఈ బుల్లితెర బ్యూటీలు. సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ లానే.. సీరియల్స్ లో కూడా స్టార్ హీరోయిన్స్ లా పేరు తెచ్చుకున్నవారు ఉన్నారు.

ప్రేమి విశ్వనాధ్, రాశి, కస్తూరి శంకర్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇక అంత భారీ పారితోషికాలు అందుకుంటున్న ఆ లిస్ట్ లో వసుధార కూడా ఉందట. ఇక బుల్లితెర స్టార్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ లిస్ట్ లో టాప్ అంటే వంటలక్కే. ఈమె ఒక్క రోజు షూటింగ్‌కి రూ.40 వేలు హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఈమె తరువాత అంత హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న సీనియర్ హీరోయిన్లు రాశీ, కస్తూరి ఇప్పుడు ఎలాంటి సీరియల్స్ చేయడం లేదు. దీంతో ఆ తరువాత రక్షనే లైన్లో ఉంది.

Do you know how much raksha gowda takes remuneration for guppedantha manasu serial

రక్ష ఒక్క రోజుకి గానూ.. సీనియర్ హీరోయిన్లతో సమానంగా రూ.17 వేలు అందుకుంటుందట. సినిమా రెమ్యూనరేషన్స్‌కి, సీరియల్ రెమ్యూనరేషన్స్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాకి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. సీరియల్ కు అలా కాదు. ఎపిసోడ్ ను బట్టి ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నాలుగు రోజులు పట్టొచ్చు. అలా ఆమె ఒక్కో ఎపిసోడ్ కు రూ.17 వేలు అందుకుంటుందట.

ఇదేమి చిన్న అమౌంట్ కాదు. స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న కొందరు ఒకప్పుడు కేవలం రూ. 5000 తీసుకొని నటించారు. ఇప్పుడు ఈ అమౌంట్ అంటే భారీ అనే చెప్పాలి. ఇక సీరియల్స్ ద్వారానే కాకుండా ఈ చిన్నది ఇంకోపక్క యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తోంది. అలా రక్ష దీపం ఉన్నప్పుడే నాలుగు రాళ్లను వెనకేసుకుంటుంది. ప్రస్తుతం గుప్పెడంత మనసుతో బిజీగా ఉన్న ఈ చిన్నది.. త్వరలోనే మరో సీరియల్ లో కనిపిస్తుందో.. లేక సినిమాలోనే కనిపిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X