Bigg Boss Telugu 7: 8 వారాలకు ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ బాగానే సాగుతోంది. ఇక 100 రోజుల పాటు సాగనున్న ఈ షో... ఇప్పటికే సగం రోజులు పూర్తి చేసుకుంది. ఇక రెండో దశలోకి ఎంటర్ అయింది. అయితే ఈ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యారు. గత ఏడు వారాలుగా డేంజర్ డోన్ లోకి రాకుండా ఆడుతున్న ఆట సందీప్.. గత వారం నామినేషన్స్ లోకి వచ్చారు. నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి వారమే ఆయన ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఆట సందీప్ 8 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా.. ఆ వివరాల్లోకి వెళితే....

బిగ్ బాస్ హౌస్ లో మొదటి విడుత 14 మంది ఎంటర్ అవ్వగా.. అందులో ఒకరు ఆట సందీప్. ఇక ఎంట్రీ మొదటి నుంచే ఆయన ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హౌస్ లో మొదటి పవర్ అస్త్ర సాధించిన వ్యక్తి ఆట సందీప్. ఆయన పవర్ అస్త్ర సాధించుకుని బిగ్ బాస్ హౌస్ కి మొదటి హౌస్ మేట్ అయ్యారు. ఆయన తర్వాత శివాజీ, శోభా శెట్టి పవర్ అస్త్ర సాధించి.. హౌస్ మేట్స్ అయిన సంగతె తెలిసిందే.

Do you know how much remuneration Ata Sandeep took for 8 weeks for Bigg Boss Telugu 7?

ఇక సందీప్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో రికార్డులు సృష్టించారు అనే చెప్పాలి. ఎందుకంటే.. మొదటి పవర్ అస్త్ర సాధించి.. మొట్ట మొదటి హౌస్ మేట్ అయ్యారు. ఇక ఆ తర్వాత సంచాలక్ గా వ్యవహారించారు. అలా ఉండటం వల్ల ఆయన నామినేషన్స్ లోకి రాలేదు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో అర్జున్ అంబటి, పూజా మూర్తి, నయని పవని, బోలే షవాలి, అశ్విని శ్రీ ఉన్నారు.

అయితే అర్జున్ అంబటి మొదటి సారిగా సందీప్ ను నామినేట్ చేశారు. కానీ ఊహించని రేంజులో గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి ఎంట్రీ ఇచ్చి.. సందీప్ ను సేవ్ చేశాడు. ఇక అలా నామినేషన్స్ నుంచి సందీప్ 5వ వారం కూడా తప్పించుకున్నాడు. ఇక ఆరో వారంలో ఆయన నామినేట్ అయినప్పటికీ.. బిగ్ బాస్ సింగిల్ ఓట్ కౌంట్ చేయకపోవడంతో.. మళ్లీ సందీప్ సేవ్ అయ్యాడు. ఇక సందీప్ 7 వారాలుగా సేవ్ అవుతూ వచ్చి.. ప్రపంచంలోనే బిగ్ బాస్ హౌస్ లో 7 వారాలుగా నామినేషన్లో లేకుండా ఓ చరిత్ర సృష్టించాడు.

ఇక ఆట సందీప్ 7 వవారం నామినేషన్స్ లో నామినేట్ అయ్యాడు. ఇక ఈ వారం ఓటింగ్ చూసుకుంటే.. ఆట సందీప్ కు మొదట బాగానే వచ్చినప్పటికీ.. తర్వాత తగ్గిపోయిందని తెలుస్తోంది. దాంతో ఆయన ఈ వారం ఎలిమినేట్ అయ్యారట. ఇక మరో వాదన ఏంటంటే.. శోభా శెట్టికి కూడా ఈ వారం ఓటింగ్ తక్కువగా వచ్చిదంట. అయితే ఆమెను సేవ్ చేయడానికి ఆట సందీప్ ను బలి చేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఆట సందీప్ 7వారాలుగా డేంజర్ జోన్ లోకి అడుగుపెట్టకుండా.. ఆడాడు.

ఇక 8 వ వారంలో ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యారు. మరి ఎనిమిది వారాలకు ఆట సందీప్ భారీగానే సొమ్ము తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఆట సందీప్ కు వారానికి బిగ్ బాస్ నిర్వాహకులు రూ.2.50 లక్షలు ఇచ్చారు. అలా 8 వారాలు షోలో కొనసాగిన ఆట సందీప్.. దాదాపు రూ.20 లక్షల రూపాయలు ఇంటికి తీసుకువెళ్లనున్నారు. 8వారాల్లో 20 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కన ఆయన బాగానే వెనకేసుకున్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X