Bigg Boss Telugu 7: బోలే షావలి ఎలిమినేట్... 5 వారాలకు ఎంత ఛార్జ్ చేశాడో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. 10వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ కోసం కంటెస్టెంట్సే కాకుండా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. శివాజీ మినహా ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఆసక్తిగా మారగా.. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం మేరకు బోలే షవాలి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఇక ఆయన 5 వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సీజన్ కాస్త భిన్నంగా సాగుతోంది. ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ ప్రతి వారం ఏదో ఒక రకంగా షాక్, ట్విస్టు, సర్ ప్రైజ్ ఇస్తునే ఉన్నారు. ఇక గతవారం అంతా ఫ్యామిలీ వీక్ పేరిట.. షోను ఎమోషనల్ చేసేశాడు. ఇక హౌసులోని ప్రతి ఒక్కరిని ఏడిపించేశాడు. అంతేనా.. చూసే ప్రేక్షకులను కూడా ఎమోషనల్ చేసేశాడు.

Do you know how much remuneration Bhole Shavali took for 5 weeks for Bigg Boss Telugu 7?

ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియం ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, యావర్, గౌతమ్, బోలే షవాలి, రతికా రోజ్ ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో వీరు ఉండగా.. మొదటి నుంచి శివాజీ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. మిగతా వారు మాత్రం డేంజర్ జోన్ లో ఉంటూ వచ్చారు. ఇక ఈ వారం అంతా రతిక రోజ్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. గత వారంలోనే ఆమె తృటిలో ఎలిమినేషన్ తప్పుంచుకుంది.

ఇక వారం బోలే, యావర్, గౌతమ్ రతికా రోజ్ డేంజర్ జోన్ లో ఉండగా.. ఫ్యామిలీ వీక్ పేరు మీద యావర్, గౌతమ్ గట్టేక్కారు. వీరి ఫ్యామిలీలు హౌసులోకి ఎంటర్ అవ్వడం.. గౌతమ్, యావర్ లకు మదర్ సెంటిమెంట్.. బాగా కలిసి వచ్చింది. యావర్ తల్లి లేకపోవడంతో.. గౌతమ్ తల్లి దగ్గరకు తీసుకుని హత్తుకుని ముద్దలు తినిపించింది. శోభా శెట్టి తల్లి సైతం..యావర్ కు దైర్యం చెప్పింది. ఇక యావర్ బ్రదర్ కూడా రావడం ప్లస్ అయింది.

Do you know how much remuneration Bhole Shavali took for 5 weeks for Bigg Boss Telugu 7?

ఇక ఫ్యామిలీ వీక్ పేరుతో.. యావర్, గౌతమ్ లకు మంచి ఓటింగ్ పెరిగింది. ఇక నామినేషన్స్ లో ఉన్న బోలే షవాలి తరఫున ఆయన భార్య వచ్చింది. కానీ అంతగా ఎమోషన్ పండలేదని చెప్పాలి. ఇక బోలే షవాలి కూడా తనతో ఏదో మాట్లాడుతున్నాడు తప్ప.. గేమ్ గురించి అడగలేదు. ఆమె కూడా ఎలాంటి లీక్స్ ఇవ్వకుండా వెళ్లిపోయింది. ఇక రతికా రోజ్ తండ్రి ఎంటర్ అయ్యాడు కానీ.. అది చివరి రోజున ప్లే చేశారు. ఇక ఈ వారం రతికా రోజ్, బోలే షవాలిలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని మొదటి నుంచి అంతా అనుకున్నారు. ఇక బోలే షవాలి ఎలిమనేట్ అయినట్లు తెలుస్తోంది.

బోలే బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి లేని సంగతి తెలిసిందే. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆయన హౌస్ లోకి వచ్చి.. ఆటను ఆడుతూ వచ్చాడు. బోలే షవాలి రావడం రావడం.. శివాజీ టీములో చేరి గేమ్ ఆడుతూ వచ్చాడు. ఇక 5వ వారంలో బోలే ఎలిమినేట్ అవ్వగా.. 5 వారాలకు ఆయన రూ.6.25 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే వారానికి ఆయన రూ.1.25 లక్షలు వసూలు చేశాడు. అయితే మొత్తానికి బోలే షవాలి మొత్తానికి బాగానే వసూలు చేశాడని అంటున్నారు నెటిజన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X