Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ లో దుమ్మురేపుతోన్న ఓరుగల్లు పోరడు.. నబీల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిం
Bigg Boss Telugu 8: బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. గతంలో ఏ సీజన్ కు లేని భారీ రెస్పాన్స్ ఈ సీజన్ కు వస్తోంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు 8. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అనే ట్యాగ్ తో ప్రారంభమైన బిగ్ బాస్ ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటివరకూ మూడు వారాలు సక్సెస్ పుల్ గా కంప్లిట్ చేసుకొని నాలుగువారం చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ లో ఓరుగల్లు పోరడు నబీల్ అఫ్రిదీ దుమ్మురేపుతోన్నాడు. ఈ తరుణంలో ఆయనకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే చర్చ నెటింట్లో జోరుగా సాగుతోంది. ఇంతకీ వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఓ లూక్కేయండి.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఒక బిగ్ బాస్ షోలోనే కనిపిస్తున్నాయి. ప్రస్తుత షోలో ఎప్పడూ జరగని, చూడని ట్వీస్టులు ఈ సీజన్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్లు కూడా తగ్గేదేలే అన్నట్టు తన పర్మామెన్స్ ఇస్తున్నారు. టాస్కుల్లో కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 11 మంది కంటెస్టెంట్లో యూట్యూబర్ నబీల్ ఆఫ్రిదీ దుమ్మురేపుతున్నాడు. తన ఆట, మాట తీరుతో అందరీని ఆట్రాక్ట్ చేస్తున్నారు.

వరంగల్‌కు చెందిన యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది 14వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ షోలో చేరారు. 14వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈయన తనదైన స్టైల్‌లో టాస్కులు ఆడుతూ.. బిగ్ బాస్ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. పైగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 హోరాహోరీగా సాగుతోంది. హౌస్‌లో ఎక్కువగా వివాదాలు చోటుచేసుకోవడంతో నాగార్జున హౌస్‌మేట్స్ కు ఓసారి క్లాస్ పీకారు. ఇక మూడు వారాలు ఎలిమినేషన్స్ విజయవంతంగా జరిగాయి. ఇప్పటికే బేజవాడ బేబక్క, శేఖర్ బాషా, ఊహించని కంటెస్టెంట్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యి.. ఇంటికి చేరుకున్నారు.
అయితే వరంగల్‌కు చెందిన యూట్యూబర్ నబీల్ ప్రస్తుతం బిగ్ బాస్ లో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా నిలిచాడు. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో విభిన్నమైన కంటెంట్‌తో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ అప్పట్లో ఎక్కువమందికి ఈయన తెలియదు. బిగ్ బాస్ కంటే ముందు నబీల్ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు చాలా మందికి నబీల్ టైటిల్ ఫేవరేట్ గా మారిపోయాడు. చాలా మంది నబీల్ కు ఓట్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నబీల్ పేరే మారుమోగుతుంది. 90 శాతం నబీల్ కప్పు కొడతాడని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్ల మోత మోగిస్తున్నారు.

నబీల్ ఓటింగ్‌లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డ్స్ బ్రేక్ చేసి టాప్‌లో దూసుకుపోతున్నాడు. గేమ్ పై మంచిగా ఎఫర్ట్స్ పెడుతూ తన సత్తా చాటుతున్నాడు. నబీల్ చీఫ్ అయ్యే చాన్స్ కూడా ఉండేది. కానీ సోనియా కారణంగా మిస్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. అమ్మాయిలకు దూరంగా ఉంటూ టైటిల్ విన్నర్ రేస్‌లోకి వచ్చిన నబీల్ బిగ్ బాస్ కు రాకముందు ఇన్ స్టా ఖాతాలో నాలుగున్నర లక్షల మంది అనుచరులు ఉండేవారు. ప్రస్తుతం నబీల్ 25 రోజుల్లోనే దాదాపు 6 లక్షలకు పైగా అనుచరులను సొంతం చేసుకున్నారు.
నబీల్ ఇలాగే తన ఆట తీరు కొనసాగితే మాత్రం బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ ట్రోఫీ అందుకోవడం పక్కా అని అభిమానులు తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. అయితే బిగ్ బాస్ యాజమాన్యం నబీల్ కు ప్రతీ వారం 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుందట. ఈ వార్త ఎంతవరకు వాస్తవమూ తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ దుమారం రేపుతోంది.


Click it and Unblock the Notifications











