Bigg Boss Telugu 7: పూజా మూర్తి వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ గత సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. ఇక ఐదో వారంలో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో సీరియల్ నటి పూజా మూర్తి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ అడుగుపెట్టాక తనదైన శైలీలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మరి ఈ భామ వారానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ లోకి వైల్డ్ కార్డు ద్వారా 5 మంది ఎంటర్ అయిన విషయం తెలిసిందే. సీరియల్ యాక్టర్ అర్జున్ అంబటి, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నయని పవని, నటి అశ్విని శ్రీ, సీరియల్ నటి పూజా మూర్తి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక అందులో పూజా మూర్తి విషయానికి వస్తే.. ఆమె సీజన్ ప్రారంభంలోనే ఎంటర్ అవ్వాల్సి ఉండే. కానీ ఆమె తండ్రి మరణంతో హౌస్ లోకి వెళ్లలేకపోయింది.

Do you know how much remuneration Pooja Murthy gets per week in Bigg Boss Telugu 7 Show?

బిగ్ బాస్ హౌజ్ లో మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతుంది అనే క్రమంలో పూజా మూర్తి తండ్రి చనిపోయినట్లు వార్త అందుకుంది. ఇక షోని క్యాన్సిల్ చేసుకుని... ఇంటికి వెళ్లిపోయింది. ఇక తండ్రి కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని... బిగ్ బాస్ 2.ఓ లోకి వైల్డ్ కార్డు ద్వారా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. తనలో తండ్రి చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకుని... బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటి. ఇక ఇంట్లో కూడా నాన్న కోసం ఆడాలి అంటూ... తనని ఇన్ స్పైర్ చేసుకుంటూ ఆటను ఆడుతోంది.

అయితే షోలోకి అడుగుపెట్టే ముందే...తను బొద్దుగా ఉన్నట్లు చాలా చోట్ల అవమాన పరిచారని... టాలెంట్ కు బాడీకి సంబంధం లేదని చెప్పుకు వచ్చింది. చాలా ఎమోషల్ అయింది. అయితే సీరియల్స్ లో నటిగా ఈ భామకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ భామ జీలో ప్రసారం అయ్యే గుండమ్మ కథ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఈ సీరియల్ లో బొద్దుగా కనిపిస్తూ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Pooja Murthy Remuneration For Bigg Boss

ఇక బిగ్ బాస్ హౌజ్ లో కూడా తనదైన శైలిలో ఆట ఆడుతూ.. ముందుకు వెళ్తోంది. అటు సొంత టీంలోనే గొడవలు అయినా... పట్టించుకోకుండా దైర్యంగా ఆడుతోంది. గేములో భాగంగా అశ్విని శ్రీతో పలు సార్లు గొడవలు అయ్యాయి. కొన్ని సార్లు ఏడుస్తూ ఈ భామ లో అయింది.. మరోవైపు బోలే షావలి.. ఆమె బుగ్గలు గిల్లుతూ.. పిచ్చిగా ప్రవర్తించాడు. దానికి ఆమె చాలా ఫీల్ అయింది. అయినా ఇవన్నీ తట్టుకుని ఆట ఆడుతూ... ముందుకు వెళ్తోంది.

ప్రస్తుతం ఈ భామ బిగ్ బాస్ షోలో వారానికి రూ.2లక్షలు తీసుకుంటుంది. అయితే ఈమె ఆట తీరు బాగా అనిపిస్తే.. షో నిర్వాహకులు పెంచుతామని చెప్పారట. ప్రస్తుతం మాత్రం వారానికి 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుంది పూజా. ఇలా ఓ ఐదు వారాలు ఆడినా.. ఈ భామకు 10లక్షల రూపాయలు వస్తాయి. దానితో పాటు క్రేజ్ కూడా లభిస్తుంది. చూడాలి మరి ఈ భామ ఎన్ని రోజులు ఉంటుందో మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X