Bigg Boss Telugu7: పూజా మూర్తి ఎలిమినేట్... 2 వారాలకు అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందా?

బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక దసరా కానుకగా ప్రసారం చేసిన ఎపిసోడో ఆటలు, పాటలతో అలరించింది. ఇక ఈ వారం.. ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి ఎలిమినేట్ అయింది. వచ్చి రెండు వారాలు కాలేదు.. కానీ ఆమె ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఆమె రెండు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది.. ఎంత ఇంటికి తీసుకువెళ్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ సిీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదో వారంలో ఐదుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఐదో వారంలో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక అందులో అంబటి అర్జున్, అశ్విని, పూజా మూర్తి, నయని పవని, బోలే షవాలి ఉన్నారు. ఇందులో నయని పవని పోయిన వారం ఎలిమినేట్ అయింది.

Do you know how much remuneration Pooja Murthy took for 7 weeks for Bigg Boss Telugu 7?

ఇక ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగింది. దసరా కానుకగా ఆటలు, పాటలతో ఉత్సాహంగా సాగింది. ఇక ఈ ఎపిసోడ్ లో రతికా రోజ్ ఎంట్రీ ఇవ్వగా... పూజా మూర్తి ఎలిమినేట్ అయింది. పూజా మూర్తి.. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా వచ్చి రెండు వారాలు మాత్రమే అయింది. ఇక ఆమె హౌస్ లోకి అడుగుపెట్టిన రోజే అందరి దృష్టిని ఆకర్షించింది.

అసలు పూజా మూర్తి మొదటగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాల్సి ఉండే. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుంది అనే క్రమంలోనే... ఆమె తండ్రి మరణించాడు. దీంతో ఆమె బిగ్ బాస్ ప్రయాణం ఆగిపోయింది. ఇక బిగ్ బాస్ 2.ఓ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇక ఆమెను లావుగా ఉన్నావంటూ కొంత మంది కామెంట్స్ చేశారంటూ బిగ్ బాస్ ఏవీలో చెప్పుకువచ్చింది.

ఇక హౌస్ లో అడుగుపెట్టిన పూజా... రావడం రావడమే.. తన టీమ్ లోని అశ్విని శ్రీతో గొడవలు పెట్టుకుంది. ఇక సీరియల్ బ్యాచ్ లో కలిసిపోయింది. ఇక ఆటల్లో కూడా అంతంత మాత్రమే పాల్గొంది. అయితే నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో బోలే, అశ్విని, పూజా ఉండగా.. పూజా మూర్తి ఎలిమినేట్ అయిపోయింది. బోలే వర్సెస్ పూజా మూర్తి నామినేషన్స్ లో ఉండగా... పూజా ఎలిమినేట్ అయింది.

Do you know how much remuneration Pooja Murthy took for 7 weeks for Bigg Boss Telugu 7?

వచ్చిన రెండు వారాలకే పూజా మూర్తి ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండు వారాలకు ఆమె తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలకు కలిపి పూజా మూర్తి కేవలం రూ.3 లక్షలు మాత్రమే తీసుకుందట. ఈ లెక్కన ఆమెకు వారానికి కేవలం రూ. 1.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇక అతి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ గా పూజా మూర్తి నిలిచింది. ఇక బిగ్ బాస్ 7 వారాలుగా ఫీ మేల్ కంటెస్టెంట్స్ నే ఎలిమినేట్ చేస్తున్నాడు. ఇదో రికార్డు కూడా. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X