Bigg Boss Telugu7: రతిక ఎలిమినేట్..4 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది. ఇక నాలుగు వారాలు ఈ సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇక ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా... ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారంలో రతికా రోజ్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఈరోజు షో లో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇక రతికా రోజ్ ఈ నాలుగు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఈస్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం అయింది. ఇక ఈ సీజన్ ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ మొదటి నుంచి చెప్పుకువచ్చారు మేకర్స్. అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 డిఫరెంటుగా ఉంది. ఇక ఈ సీజన్ లో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంటర్ అయ్యారు. ఇక ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం రతికా రోజ్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. రతికా రోజ్ కు ఓటింగ్ బాగానే వచ్చినప్పటికీ... ఆమెపై వస్తున్న నెగిటివిటీ వల్ల ఆమెను ఎలిమినేట్ చేస్తున్నారని సమాచారం. ఇక రతికా రోజ్ మొదటి హౌజ్ లోకి అడుగుపెట్టినప్పుడు... కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపింది. హౌజ్ లో ఎక్కడ చూసిన ఈ జంటే సపరేటుగా కనిపించేది.
ఇక రైతు బిడ్డతో పులిహోర కలిపిందంటూ.. నెట్టింట వైరల్ గా మారింది రతికా. ఇక ఆ తర్వాత రెండో వారం నామినేషన్స్ లో రతికా ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించింది. అప్పటి వరకు ఆమెను నమ్మిన ప్రశాంత్ షాక్ కు గురయ్యాడు. వారి మధ్య ఓ పెద్ద గొడవ అయితే జరిగింది. ఇక ఈ గొడవతో మళ్లీ వీరు కలవరు అనుకున్నారు. మధ్యలో రతిక.. యావర్ ట్రాక్ కూడా నడించింది. ఇక నెటిజన్స్ కూడా దీనిపై ట్రోలింగ్ చేశారు.

ఇక మళ్లీ రైతు బిడ్డ ప్రశాంత్ వచ్చి రతికాకు సారీ చెప్పడంతో మళ్లీ మాటలు మొదలు అయ్యాయి. ఇక మొన్నటి నామినేషన్స్ లో మళ్లీ గొడవ స్టార్ట్ అయింది. ఇక రతికాను అక్క అంటూ ప్రశాంత్ పిలువడం మొదలు పెట్టాడు. ఇక పవర్ అస్త్ర పోటీల్లో కూడా ప్రశాంత్ ను ఓడించేందుకు రతికా అమర్ దీప్ తో కలిసి చిల్లర చేష్టలు చేసింది. ఇక దానిపై నాగార్జున క్లాస్ కూడా ఇచ్చాడు. ఇక మొత్తానికి రతికా నాలుగో వారంలో ఎలిమినేట్ కానుంది.

ఇక నాలుగు వారాలకు రతిక దాదాపు రూ.8లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వారానికి 2 లక్షల రూపాయలు తీసుకోగా... రోజుకు 28వేల 570 రూపాయలు తీసుకుందని తెలుస్తోంది. 4 వారాలకు రతిక మొత్తం మీద రూ.8లక్షలు తీసుకుంది.


Click it and Unblock the Notifications











