Bigg Boss Telugu 7: 12వ వారం రతికా రోజ్ ఎలిమినేట్.. రీఎంట్రీ తర్వాత ఎంత సంపాదించిందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షో.. గత 12 వారాలుగా అలరిస్తూ వస్తుంది. ఇక గత వారమే నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. ఇక నాగార్జున అన్నట్లుగానే నిన్న అశ్విని, ఈరోజు రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే రీఎంట్రీ తర్వాత రతికా రోజ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది... రీ ఎంట్రీకి ముందు ఎంత తీసుకుంది.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి కలగజెస్తుంది. ఈ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పటి వరకు 11 మంది ఎలిమినేట్ అయ్యారు. అందులో షకీలా, కిరణ్ రాథోడ్, దామిని, శుభ శ్రీ, రతికారోజ్, నయని పవని, పూజా మూర్తి, బోలేషవాలి, టేస్టి తేజ, ఆట సందీప్, అశ్విని శ్రీ ఉన్నారు. ఇక రతికా రోజ్ రెండు సార్లు ఎలిమినేట్ అయింది.

Do you know how much remuneration Rathika Rose took for Bigg Boss Telugu 7?

రతికా రోజ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం. ఈ బ్యూటీ రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ గర్లఫ్రెండ్ కావడంతో... హైలెట్ గా నిలిచింది. ఇక హౌస్ లోకి వచ్చి.. ఈ భామ పల్లవి ప్రశాంత్ తో పులిహోర కలిపింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను నామినేషన్స్ లో రెచ్చిపోయి మాట్లాడి నెగిటివిటీ తెచ్చుకుంది. దీంతో నాలుగు వారాల తర్వాత ఈ భామ ఎలిమినేట్ అయింది.

Do you know how much remuneration Rathika Rose took for Bigg Boss Telugu 7?

ఇక నాలుగు వారాలకు బిగ్ బాస్ ఈ బ్యూటీకి వారానికి రెండు లక్షల చొప్పన నాలుగు వారాలకు 8 లక్షలు ఇచ్చింది. దీంతో భారీగానే బిగ్ బాస్ షో ద్వారా వెనకేసుకుందని అనుకున్నారు. ఇక కొద్ది రోజులు ఈ భామపై పూర్తి నెగిటివిటి వచ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆరవ వారంలో ఈ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తన నెగిటివిటినీ పొగుట్టుకునేందుకు తెగ ప్రయత్నం చేసింది.

ఇక మళ్లీ రీ ఎంట్రీ తర్వాత రతికా రోజ్ శివాజీ పంచన చేరింది. అలా అమర్ మీద ఫోకస్ పెట్టింది. దీంతో మళ్లీ నెగిటివిటీ మూటగట్టుకుంది. ఈ భామ ఎప్పుడు ఎలిమినేట్ అవుద్దో అని నెటిజన్స్ వెయిట్ చేసారు. ఇక ఎట్టకేలకు 12వ వారంలో మళ్లీ ఎలిమినేట్ అయింది. వచ్చిన అవకాశాలను రతికా యూజ్ చేసుకోలేదని అంటున్నారు నెటిజన్స్.

Do you know how much remuneration Rathika Rose took for Bigg Boss Telugu 7?

ఇక రీ ఎంట్రీ తర్వాత రతికా రోజ్ 6 వారాలకు 12 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వారానికి 2లక్షల చొప్పన మొత్తం 6 వారాలకు 12లక్షలు సంపాదించుకుంది. ఇక రీఎంట్రీ కి ముందు.. తర్వాత మొత్తం బిగ్ బాస్ హౌస్ లో 10 వారాలు ఉంది రతికా రోజ్. ఇక ఈ పది వారాలకు ఈ భామ 20 లక్షలు సంపాదించింది. దీంతో భారీగానే వెనకేసుకున్నట్లు అంటున్నారు నెటిజన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X