Bigg Boss Telugu7: శుభ శ్రీ ఎలిమినేట్.. 5 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసరికి అందరూ టీవీల ముందు అతుక్కుని పోతారు. ఇక ఈ వీకెండ్ ఊహించని ట్విస్టులు, షాక్ లు అంటూ నాగార్జున ముందు నుంచి చెప్పుకువచ్చారు. ఇక ఈ 5 వారం ఎలిమినేషన్ కీలకంగా మారింది. ఓవైపు బిగ్ బాస్ 2.ఓ లాంచ్ తో పాటు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని సస్పెన్స్ ఉండేది. ఇక ఈ వారం ఐదు వారాలుగా కంటెస్టెంటుగా తన మాటలతో, అందంతో అలరించిన శుభ శ్రీ ఎట్టకేలకు ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఐదు వారాలకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనేది ఈ స్టోరీలో చూద్దాం.

శుభ శ్రీ రాయగురు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఐదు వారాలుగా ఈ భామ.. హౌజ్ లో తన అందం, అభినయం, చలాకీ మాటలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా నామినేషన్స్ లో భాగంగా అమర్ దీప్ ఆమెపై అరవడంతో.. ఏడవడం స్టార్ట్ చేసింది. ఆ వీడియో చాలా వైరల్ గా మారింది. దానికి కారణం.. ఎంత ముద్దుగా ఏడుస్తుందంటూ నెటిజన్స్.. కామెంట్స్ పెట్టి ట్రెండింగ్ చేశారు.

Do you know how much remuneration Shubasree Rayaguru took for 5 weeks for Bigg Boss Telugu 7?

ఇక ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 5 వ వారంలో శుభ శ్రీ ఎలిమినేట్ అయింది. ఈ భామ ఎలిమినేషన్ తో ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందారు. అప్పటి వరకు ఈ భామ టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలుస్తుందని అనుకున్నారు. ఇక శుభ శ్రీ ఎలిమినేట్ అవ్వడం.. నెటిజన్స్ కు, ప్రేక్షకులకు షాక్ అని చెప్పవచ్చు. ఈ భామ జర్నీని నాగార్జున బిగ్ బాస్ టీవీలో ప్లే చేశారు. ఇక ఈ జర్నీ చూస్తే మాత్రం... అందరినీ ఆకట్టుకునేలా ఎమోషనల్ గా ఉంది.

శుభ శ్రీ రాయగురు ఒడిశాలో పుట్టి పెరిగింది. ఇక సినిమాల ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో నటించింది. ఇక అమిగోస్ చిత్రంలో కూడా ఈ భామ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక తెలుగులో అమిగోస్, కథ వెనుక కథ, సందేహం సినిమాల్లో నటించింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టి.. అందరినీ ఆకట్టుకుంది.

Do you know how much remuneration Shubasree Rayaguru took for 5 weeks for Bigg Boss Telugu 7?

ఇక శుభ శ్రీ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే... ఈమె వారానికి 2 లక్షలు ఛార్జ్ చేసింది. ఈ భామ వారానికి రెండు లక్షల రూపాయల చొప్పున ఈ భామ మొత్తానికి 5 వారాల్లో రూ. 10లక్షలు బిగ్ బాస్ నుంచి వసూలు చేసింది. ఇక ఈ భామ రోజుకు రూ. 5,714 చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక మొత్తానికి శుభ శ్రీ బిగ్ బాస్ నుంచి భారీగానే వసూలు చేసిందని నెటిజన్స్ అంటున్నారు.

Do you know how much remuneration Shubasree Rayaguru took for 5 weeks for Bigg Boss Telugu 7?

ఇక బిగ్ బాస్ హౌజ్ లో 14 మంది ఎంటర్ అవ్వగా.. ఐదుగురు అమ్మాయిలే ఎలిమినేట్ అవ్వడం విశేషం. ఇక అందులో మొదట కిరణ్ రాథోడ్, రెండో వ్యక్తి షకీలా, మూడో కంటెస్టెంట్ దామినీ, నాలుగో కంటెస్టెంట్ రతికారోజ్, ఇప్పుడు ఐదో కంటెస్టెంట్ శుభ శ్రీ రాయగురు.. ఇలా మొత్తం ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ చరిత్రలో వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం మొదటి సారి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X