Bigg Boss Telugu7: ఈ వారం దామిని ఎలిమినేట్.. 3 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా ఆసక్తికరంగా సాగిపోతోంది. ఇప్పటికే రెండు వారాలు విజయవంతంగా పూర్తి కాగా... మూడో వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఆదివారం నాడు నాగార్జున ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. అయితే సోషల్ మీడియాలో లీకుల ప్రకారం ఎలిమినేట్ అయ్యేది దామిని భట్ల అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఆమె రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు ఎంత తీసుకుంది అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే....
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ సింగర్స్ లో దామిని భట్ల కూడా ఒకరు. ఆమె తనదైన శైలిలో పాటలు పాడుతూ... గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అందంతో కూడా పలువురిని ఆకర్షిస్తూ వచ్చింది. బాహుబలి సినిమాతో దామిని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన అభిమానులను పాటలతోనే కాదు తనదైన అందంతో కూడా అలరిస్తూ వచ్చేది.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు కేవలం సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి అలరిస్తూ వచ్చిన ఆమె... బిగ్ బాస్ హౌజ్ లోపలికి వెళ్ళాక మాత్రం అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ ఎవరో ఊహించని విధంగా మంచి క్రేజ్ సంపాదించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోపల ఒక స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ గా చాలా పోటీ ఇచ్చిన ఆమె అనూహ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది.
హౌస్ లో ఉన్న వారితో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం మీద వివాదాలు పెట్టుకుంటూ ఉండే ఈ భామ ఈ వారం ఎలిమినేట్ అయిపోతుందని అంటున్నారు. అయితే ఈ భామ వారానికి రెండు లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నట్లుగా బిగ్ బాస్ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఆమెకు నిజానికి ఒక పాట పాడితేనే అంత అమౌంట్ వస్తుంది కానీ... బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే ఆమె ఈ హౌస్ లోకి వెళ్లి వచ్చిందని అంటున్నారు.

గతంలో పలువురు సింగర్స్ కూడా ఇలాగే బిగ్ బాస్ లోకి వెళ్లి కొన్నాళ్ల పాటు ఉండి అలరించి వచ్చారు. ఆమె రోజుకు 28 వేల రూపాయలకు పైగానే సంపాదిస్తుందని అంటున్నారు. అయితే మూడు వారాలకు గాను ఆమె ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వీటిలో కటింగ్స్ పోయిన 5 లక్షల పైగానే ఆమె చేతికి అందుతాయని అంటున్నారు.

బిగ్ బాస్ లీక్స్ ప్రకారం దాదాపుగా ఆమె ఎలిమినేట్ అయిపోయినట్లే. అయితే చివరి నిమిషంలో ఏమైనా బిగ్ బాస్ మెలికలు పెడితే తప్ప అందులో ఎలాంటి మార్పులు ఉండవు. ఇక ఇప్పటికే హౌజ్ మేట్స్ గా ఆట సందీప్, శివాజీ, ప్రియాంక జైన్ కన్ఫార్మ్ అయ్యారు. ఇక దామిని ఎలిమినేషన్ తో హోజ్లో మిగిలేది 11 మంది మాత్రమే. వీరితో ఆట కొనసాగించడం కష్టమే. త్వరలో బిగ్ బాస్ 2.ఓ ఉంటుందని.. అందులో కొంత మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











