Bigg Boss Telugu7: టేస్టీ తేజ ఎలిమినేట్.. 9 వారాలకు ఎంత ఛార్జ్ చేశాడో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం 12 మంది మిగిలారు. ఇక అందులో ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉండగా.. ఎలిమినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. టేస్టీ తేజ. ఎన్నో వారాలుగా అందరినీ అలరిస్తూ.. వస్తున్న తేజ.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇక ఆయన రెమ్యూనరేషన్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్‌ బాస్ తెలుగు సీజన్ లో మొదటగా 14 మంది హౌస్ లో అడుగుపెట్టారు. ఇక తర్వాత ఐదో వారంలో ఐదుగురు ఎలిమినేట్ తర్వాత ఐదు మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇక హౌస్ లో ప్రస్తుతం... 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌత‌మ్‌, ప్ర‌శాంత్‌, అశ్విని ఈ వారం నామినేషన్స్ లో లేరు. అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, బోలే షవాలి, టేస్టీ తేజ, యావర్, రతికారోజ్ నామినేష‌న్స్‌లో ఉన్నారు.

Do you know how much remuneration Tasty Teja took for 9 weeks for Bigg Boss Telugu 7?

ఇక మొదటి నుంచి ఓటింగ్ పరంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది.. శోభా శెట్టి అనుకున్నారు అంతా. నిజానికి ఆమె గ‌త‌వార‌మే ఎలిమినేట్ అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ బిగ్‌ బాస్ వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ సందీప్‌ ను పంపించేసి ఆమెను హౌస్‌లో సేఫ్ చేశాడు. ఈసారి కూడా బిగ్‌ బాస్ అదే ప్లాన్ అమ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌న కోసం మ‌రో కంటెస్టెంట్‌ను బ‌లి చేశారని అర్థం అవుతుంది. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. శోభా దోస్త్ టేస్టీ తేజ‌.

తేజ మొదటి నుంచి ఎలిమినేషన్ అంటే భయపడుతూ ఉంటాడు. ఇక ఈ వారం ఆయన ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ నిర్వహాకుల నుంచి సమాచారం ప్రకారం తెలుస్తోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌, నామినేష‌న్స్‌లోకి వ‌స్తే ఆత్మ‌స్థైర్యం పెరుగుతుందంటూ నామినేట్ చేసే తేజ.. ఈ సారి ఆయన ఎలిమినేట్ అయిపోయాడు.

Do you know how much remuneration Tasty Teja took for 9 weeks for Bigg Boss Telugu 7?

ఇక ఈ వారం ఓటింగ్ లో ముందున్నది అమర్, గౌతమ్, బోలే అని తెలుస్తోంది. ఇక డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం శోభా శెట్టి, రతికా రోజ్, టేస్టీ తేజ ఉన్నారు. చాలా వరకు అంతా శోభా శెట్టి పోతుందని అనుకున్నారు. కానీ ఆమెను బిగ్ బాస్ సేఫ్ చేశారనే వాదన వినిపిస్తుంది. మరోవైపు రతికా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెను ఇప్పట్లో పంపించరు. ఇక ఈ వారం శోభా శెట్టి ఖాతాలో మరో బకరా ఎవరు అంటే టేస్టీ తేజ.

Do you know how much remuneration Tasty Teja took for 9 weeks for Bigg Boss Telugu 7?

మొత్తానికి ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక 9 వారాలుగా తన ఆటతో అలరిస్తున్న తేజ.. ఇంటికి రూ.13.5 లక్షలు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ.21,428వేలు సంపాదించాడు. ఈ లెక్కన తేజ బాగానే వసూలు చేశాడని తెలుస్తోంది. బిగ్ బాస్ షో పేరిట తేజ గట్టిగానే వసూలు చేసినట్లు నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X