Bigg Boss లో నాగార్జున వేసుకున్న షర్ట్ రేట్ తెలుసా? తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే!

తెలుగు సినీ పరిశ్రమలో మన్మధుడు అనగానే గుర్తు వచ్చే ఏకైక హీరో నాగార్జున.. హీరోగా ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఒకప్పుడు ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కింగ్ ఇప్పుడు 60 ఏళ్ల వయసొచ్చినా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున వేసుకున్న ఒక షర్ట్ ఇప్పుడు చర్చనీయాంమయింది. ఆ షర్ట్ ఏంటి? ఆ షర్ట్ రేట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే

మొదటి హీరోగా

మొదటి హీరోగా


తెలుగు హీరోలలో ముందుగా హోస్ట్ గా మారిన నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరులు అనే టీవీ క్విజ్ షో ని తనదైన శైలిలో హోస్టింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో నాగార్జున అటు వరుస సినిమాలు చేస్తూ ఇటు రియాల్టీ షోలు చేస్తూ ఆరు పదుల వయసులో కూడా బిజీ బిజీ గా గడుపుతున్నాడు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందుతున్న బిగ్ బాస్ కి మూడు సార్లు హోస్ట్ గా చేసి ఇంకా ఆదరణ పొందుతున్నాడు ఆయన.

రొటీన్ కుభిన్నంగా

రొటీన్ కుభిన్నంగా

బిగ్ బాస్ షో కి గత సీజన్లో హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్, నాని ఎప్పుడూ సూట్లు ధరించేవారు. కానీ నాగార్జున మాత్రం ఆ రొటీన్ కి బై చెప్పి స్వస్తి పలికి.. డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో ఎప్పటికప్పుడు మెరుస్తూ.. యంగ్‌గా మరింత గ్లామరస్‌గా కనిపిస్తూ అలరిస్తున్నారు. దీంతో నాగార్జున వేసుకున్నా షర్ట్ లు ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చనీయంగా మారుతున్నాయి.

తెగ వేతికేశారు

తెగ వేతికేశారు

మొన్నటి వారం నాగార్జున వేసుకున్న ఒక షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ షికార్లు కొడుతుంది. మొన్న శని, ఆదివారాల్లో నాగార్జున ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ లుక్ ధరించిన దాంతో మెస్మరైజ్ చేసాడు. ఆ షర్ట్ సూపర్ ఉండడంతో ప్రస్తుతం ఈ షర్ట్ గురించి, అలాగే దాని ధర గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి ధర ఎంత ఉండి ఉండవచ్చు సెర్చ్ చేసారు నెటిజన్స్.

 దిమ్మ తిరిగే రేట్

దిమ్మ తిరిగే రేట్


లెమన్‌ ఎల్లో కలర్‌లో కనిపించిన ఈ షర్ట్ కాస్ట్‌ ఎంతుంటుందబ్బా అని నెటిజన్లు సెర్చ్‌ చేయగా దిమ్మతిరిగే ధర వెలుగు లోకి వచ్చింది. ఈ షర్ట్‌ కాస్ట్‌ దాదాపు $1310 డాలర్లట. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో సుమారు 83,908 రూపాయలు అన్న మాట. దీంతో ఒక్క షర్ట్‌ కోసం నాగ్‌ ఇన్ని డబ్బులు పెట్టాటం అని కొందరు షాక్‌ అవుతుండగా, టాలీవుడ్‌ మన్మథుడికి ఆ మాత్రం రేంజ్ లేకపోతే ఎలా? అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Recommended Video

Devarakonda Brothers About Pushpaka Vimanam Movie | Part 2
 సినిమాల విషయానికి వస్తే..

సినిమాల విషయానికి వస్తే..


ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగార్జున 'ది ఘోస్ట్', 'బంగార్రాజు'సినిమాలు చేస్తున్నారు. గోస్ట్ సినిమాని ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తే ఉండగా బంగార్రాజు సినిమా ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. గతంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X