110 కోట్ల మంది చూసిన టెలివిజన్ సీరియల్ గురించి మీకు తెలుసా? రామాయణం, మహాభారత్ మించి రికార్డు!
భాష ఏదైనా, ప్రాంతం ఏమైనా బుల్లితెరపైన టెలివిజన్ సీరియల్స్‌కు ఉన్న క్రేజ్ మరోకటికి ఉండదంటే.. నమ్మాల్సిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన సీరియల్స్ వందలాది, వేలాది ఎపిసోడ్స్‌కు కొనసాగడం, సాగదీస్తూ వెళ్లడం తెలిసిందే. అయితే ఇలా రకరకాల భాషల్లో టెలివిజన్ సీరియల్స్ భారీ వ్యూవర్‌షిప్‌ను సాధించాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన సీరియల్ ఏమిటో మీకు తెలుసా? ఆ వివరాల్లోకి వెళితే..
భారతీయ వినోద పరిశ్రమలో సీరియల్స్ అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చేది రామాయణం, మహాభారతం. 80 నుంచి 90 దశకాల్లో వచ్చిన ఈ సీరియల్స్ ఆదివారం వచ్చిందంటే.. కుటుంబాలను ఏకతాటిపైకి తెచ్చి.. టెలివిజన్స్ ముందు కూర్చునేలా చేసేంది. దాదాపు 78 వారాలపాటు సాగిన రామయణం అందరికి కొత్త అనుభూతిని పంచింది. అప్పట్లో అత్యధిక బడ్జెట్‌తో అంటే 9 లక్షల రూపాయలతో నిర్మించిన సీరియల్‌గా రికార్డుకెక్కింది.

దూరదర్శన్ టెలివిజన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్ ప్రపంచంలోనే అత్యధిక మంది చూసిన సీరియల్‌గా రికార్డుకెక్కింది. 1987 జనవరి 25వ తేదీ నుంచి 1988 జూలై 31వ తేదీ వరకు ఈ సీరియల్ ప్రసారమైంది. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ప్రసారమైన దాదాపు 77 మిలియన్ల అంటే దాదాపు 77 కోట్ల మంది చూసినట్టు గణాంకాలు వెల్లడించాయి.
మహా భారతం విషయానికి వస్తే.. ఈ సీరియల్ 1988 అక్టోబర్ 2వ తేదీ నుంచి 1990 జూన్ 24వ తేదీ వరకు ప్రసారమైంది. ఈ సీరియల్ సుమారుగా 94 వారాలపాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ సీరియల్‌ను సుమారుగా 7 లక్షల రూపాయలతో నిర్మించారు. ఈ సీరియల్ కూడా అత్యధిక మంది వీక్షించిన సీరియల్‌గా రికార్డు కెక్కింది.

ఇక ఇండియన్ సీరియల్స్ కాకుండా అత్యధిక మంది వీక్షకులను ఆకట్టుకొన్న సిరీస్ బేవాచ్. ఈ సీరిస్‌ను 148 దేశాలతోపాటు సుమారుగా 44 భాషల్లోకి డబ్బింగ్ చేశారు. దాంతో ఈ సీరియల్ గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేరింది. పమేల్లా అండర్సన్, అలెగ్జాండ్రియా పాల్, జెరెమీ జాక్సన్ నటించిన ఈ సీరిస్‌ను మైఖెల్ బెర్క్ క్రియేట్ చేశారు. ఈ సీరియల్‌ను దాదాపు 110 కోట్ల మంది చూడటం ఓ రికార్డుగా ఉండిపోయింది.


Click it and Unblock the Notifications











