రాహుల్ సిప్లిగంజ్ న్యూ గర్ల్ ఫ్రెండ్.. ఆ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంటే.. తొలిసారి సీక్రెట్ రివీల్ చేసిన సింగర్!
రాహుల్ సిప్లిగంజ్... ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సింగర్ గా స్పెషల్ వీడియో సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యాడు. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి కూడా వెళ్లాడు. అక్కడే సినీ నటి పునర్నవి భూపాలంతో చాలా క్లోజ్ గా ఉండి.. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనిపించే స్థాయిలో సీన్ క్రియేట్ చేశాడు. అయితే తాజాగా తన డ్రీమ్ గర్ల్ పేరు చెప్పి గట్టి షాకిచ్చాడు. అయితే ఆమె కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే కావడం గమనార్హం. అలా అని ఆమె పున్ను మాత్రం కాదు. మరెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
జానపద పాటలు రాయడంతో పాటు పాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్. ముఖ్యంగా అద్భుతమైన వీడియో సాంగ్స్, ఆల్బమ్స్ క్రియేట్ చేసి రచ్చ చేశాడు. 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి అడుగు పెట్టి అక్కడ కూడా తన సింగింగ్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అచ్చమైన తెలుగు భాషలో, తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరికీ ఫేవరెట్ అయిపోయాడు. ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ కంటెస్టెంట గా నిలిచిన ఇతడు.. విన్నర్ కూడా అయ్యాడు.

అయితే ఆ సీజన్ లోనే నటి పునర్నవి భూపాలంతో చాలా క్లోజ్ గా ఉన్నాడు రాహుల్ సిప్లిగంజ్. అలాగే వితికా శేరు, వరుణ్ సందేశ్ లతో కూడా బాగానే ఉన్నాడు. ఈ నలుగురూ ఒక్క గ్రూపుగా ఉంటూ రచ్చ చేశారు. ఇక పున్ను పాపతో రాహుల్ చేసిన రచ్చ మామూలుగా లేదు. వీరిద్దరి బంధాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. షోలో చాలా క్లోజ్ గా ఉన్న వీళ్లు బయటకు వచ్చాక మాత్రం చాలా దూరంగా ఉన్నారు. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న రతికా రోజ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ అంటూ చెప్పడం.. ఆ ఫోటోలు బయటకు రావడం కూడా అందరిరీ తెలిసిందే.
అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇష్టపడే వాళ్లలో ఈ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఉందంటూ చాలానే వార్తలు వస్తుంటాయి. అతడు కూడా తనకు ఓ రెండు, మూడు బ్రేకప్ స్టోరీలు ఉన్నట్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పడంతో అమ్మాయి పేర్లు హైలెట్ గా నిలుస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం ఆయనే నేరుగా తన డ్రీమ్ గర్ల్ పేరును రివీల్ చేసాడు. అయితే ఆమె కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే కావడం గమనార్హం. అందులోనూ ఆయన పాల్గొన్న సీజన్ యే కావడం మరింత స్పెషల్. అయితే ఆ కంటెస్టెంట్ మాత్రం పునర్నవి కాదు. మరెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం సూపర్ సింగర్ సీజన్ లో టీమ్ లీడర్ గా ఉన్నాడు. ఈక్రమంలోనే తాజా ప్రోమో విడుదల అయింది. ఇందులో యాంకర్ శ్రీముఖితో పాటు టీం మెంబర్స్ అంతా రచ్చ చేశారు. ఈక్రమంలోన అనంత శ్రీరామ్ ఓ పాటకు డ్యాన్స్ చేసి ఏఎన్నార్ లాగా శ్రీముఖి వెకన వైపు కొట్టాడు. దీంతో మీరిలాంటి వారని నాకు తెలుసు.. అందుకే ఇతడితో ప్రేమలో ఉన్నానంటూ రాహుల్ సిప్లిగంజ్ ను చూపిస్తుంది. వెంటనే రాహుల్ సిప్లిగంజ్ కూడా నువ్వే నా డ్రీమ్ గర్ల్ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ఉంది. మీరు కూడా ఓసారి చూసేయండి.


Click it and Unblock the Notifications











