Bigg Boss Telugu 7 Finale: నక్కతోక తొక్కేసిన టేస్టీ తేజ.. బిగ్‌బాస్ తర్వాత అన్ని సినిమా ఆఫర్లా.. వావ్?
అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఫినాలే రానే వచ్చేసింది. చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజుటి ఫైనల్ ఎపిసోడ్ కోసం చాలా ఏర్పాట్లు చేసినట్లు తాజా ప్రోమో చూస్తుంటే అర్థం అయిపోతుంది. ముఖ్యంగా ఈరోజుటి ఫినాలే కోసం హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు అందరూ వచ్చారు. చాలా మంది స్పెషల్ పర్ఫార్మెన్స్ లు కూడా చేశారు. ముఖ్యంగా ఈరోజుటి ఫినాలే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఆ వివరాలు అన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 షో ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చి 105 రోజుల పాటు అద్భుతంగా అలరించింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టగా.. ఫినాలేకు ఆరుగురు వచ్చారు. అయితే షో ప్రారంభం అయిన మొదటి వారం హౌస్ లో అడుగు పెట్టిన టేస్టీ తేజ ఐరన్ హ్యాండ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లే ఎలిమినేట్ అయిపోయాడు. దాదాపు ఆరుగురు అలాగే ఇంటిని వదిలి వెళ్లారు. అయితే శివాజి దెబ్బకు టేస్టీ తేజ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. హౌస్ లో ఉన్నప్పుడు ఎంతగానో అలరించిన ఆయన.. బయటకు వచ్చాకా కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు.

నిజానికి టేస్టీ తేజ హౌస్ నుంచి వెళ్లిపోయాక కాస్త ఫన్ తగ్గిందనే చెప్పొచ్చు. శోభాశెట్టితో చాలా క్లోజ్ గా ఉంటూ విపరీతమైన ఫన్ అందించిన అతడు త్వరగా వెళ్లిపోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అలాంటి వాళ్ల కోసమే అన్నట్లుగా ఫినాలే ఎపిసోడ్ లో టేస్టీ తేజ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శోభాశెట్టితో కలిసి అతడు స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు వేయబోతున్నారు. అంతేకాకుండా నాగార్జును స్టేజీపై ఉన్న ఎక్స్ కంటెస్టెంట్లు అందరితో మాట్లాడారు. ముఖ్యంగా బిగ్ బాస్ కు ముందు ఆ తర్వాత ఎలా ఉందని అడగ్గా ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానం చెప్పారు.
ఈక్రమంలోనే టేస్టీ తేజ తన వంతు రాగానే.. బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ చాలా బాగుందని అన్నారు. ముఖ్యంగా అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. వివరించారు. అలా ఏ ఒకటో, రెండో చిత్రాల్లో అవకాశాలు కాదు... మొత్తం 15 సినిమాల్లో తనకు ఛాన్స్ వచ్చినట్లు చెప్పి షాకిచ్చాడు. ఇన్ని సినిమాల్లో అవకాశాలు రావడం అనేది ఇప్పటి వరకు ఎవరికీ జరగలేదనుకుంటా. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లి ఎలాంటి ఆఫర్లు లేక బాధ పడ్డ వాళ్ల సంఖ్యే ఎక్కువ. కానీ అందరిచేత ఐరన్ హ్యాండ్ అనిపించుకున్న టేస్టీ తేజ మాత్రం అదిరిపోయే అవకాశాలు దక్కించుకున్నాడు.

ఈ విషయాన్ని స్టేజీపై నాగార్జునకు చెప్పగా... అంతా షాకయ్యారు. నాగార్జున కూడా ముందుగా షాకై.. వావ్ అంటూ వెంటనే తేరుకుని కంగ్రాట్స్ చెప్పారు. ఏమైనా బిగ్ బాస్ షో వల్ల టేస్టీ తేజ చాలానే మంచి జరిగింది. చూడాలి మరి ముందు ముందు మనోడు ఎలాంటి సినిమాల్లో కనిపించి ఎంతలా అలరిస్తాడనేది.


Click it and Unblock the Notifications











