Bigg Boss Telugu 7 Elimination: ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబరు 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే నాలుగోవారం కూడా పూర్తి కావొస్తుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అవ్వగా.. నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలిసిపోయింది. ఈ వారం టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. దానికి కారణం ఆ ఎఫెక్ట్ పడటం వల్లేనని తెలుస్తోంది. అసలు ఆ కంటెస్టెంట్ ఎవరు.. ఏం చేశారు.. ఎందుకు ఎలిమినేట్ కావాల్సి వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఆసక్తిగా సాగుతోంది. మొదటి వారం అటు ఇటుగా అనిపించినా... రెండో వారం నామినేషన్స్ నుంచి ఈ షో రసవత్తరంగా సాగుతోంది. 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా... ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అందులో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఉండగా.. ఇక నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలిసిపోయింది.

నాలుగో వారం బిగ్ బాస్ షో ఆసక్తిగా సాగుతోంది. దానికి కారణం రైతు బిడ్డ పవర్ అస్త్ర పోటీలో నిలవడం.. హౌజ్ లోని సీరియలో బ్యాచ్ అంతా... ఆ రైతు బిడ్డపై పగపట్టినట్లే.. ప్రవర్తిస్తున్నారు. ఇక వారికి తోడు రతిక. ఆమె రైతు బిడ్డతో చాలా దారణంగా ప్రవర్తింస్తుంది. మొదట లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. ఆతర్వాత గొడవ పడ్డారు. ఇక సారీ చెప్పుకుని మళ్లీ మాటలు మొదటలు పెట్టగా.. నాలుగో వారం నామినేషన్స్ లో మళ్లీ పంచాయితీ మొదలు అయింది.

ఇక సీరియల్ బ్యాచ్ అమర్ దీప్ అయితే రతికను మరింత రెచ్చగొట్టి.. ప్రశాంత్ పై ఉసిగోల్పుతున్నాడు. దీంతో ఆమె రెచ్చిపోయి మరీ ప్రశాంత్ పై చాలా దారుణంగా కామెంట్స్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెపై ట్రోలింగ్ చాలా దారణంగా సాగుతోంది. ఇక ఆమె ఇన్ స్టా పేజ్ స్టోరీస్ లో కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకుందంటే ఆమెపై నెగిటివిటీ ఏ రేంజులో ఉందో అర్ధం అవుతుంది. ఇక ఆ నెగిటివిటి వల్లే ఆమె ఈ వారం ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది.
ఇప్పటికే వీకెండ్ ఎపిసోడ్ పూర్తి కావొస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం మేరకు ఈ వారం రతిక ఎలిమినేట్ కానుందని అంటున్నారు. దానికి తగ్గట్లుగానే ఆమె ఇన్ స్టా స్టోరీలో... బిగ్ బాస్ అప్డేట్స్ ఇచ్చే పేజ్ ను షేర్ చేసింది. అందులో రతికా ఎలిమినేట్ అయినట్లు రాసింది. అంతే కాదు ఆమె టాప్ కంటెస్టెంట్.. అమర్ దీప్ తప్పు పట్టించడం వల్ల ఆమెపై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అన్నట్లు రాసుకు వచ్చారు.

ఇక అందులో ఈ సారి రతికను సీక్రెట్ హౌజ్ కు పంపిస్తే బాగుండు.. అంటూ ఓ పేజ్ రాసుకువచ్చింది. ఇక ఆ పేజ్ రాసిన స్టోరీని రతిక తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. మరి బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేస్తారా..లేదా సీక్రెట్ హౌజ్ కు పంపిస్తారా అనేది వేచి చూడాలి. ఇక గతంలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండు రాహుల్ ను కూడా ఇలాగే బిగ్ బాస్ సీక్రెట్ హౌజ్ కు పంపించారు. మరి ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











