Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ గెలుపుకు కారణం అదే.. తొలిసారి సీక్రెట్ బయట పెట్టిన టైటిల్ ఫేవరెట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఇప్పటికే విజయవంతంగా 14 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 15వ వారంలోకి అడుగు పెట్టింది. మరో రెండు రోజుల్లో ముగిసిపోనున్న ఈ షో విన్నర్ ఇప్పటికే తేలిపోయి ఉంటుంది. కానీ మనకు మాత్రం ఈ విషయం ఆదివారం రోజే తెలుస్తోంది. ఇక చివరి వారంలో భాగంగా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈక్రమంలోనే 15వ వారంలో భాగంగా బిగ్ బాస్ అదిరిపోయే టాస్క్ లు ఇస్తూ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ సరికొత్త టాస్క్ ఇచ్చారు. అయితే గతంలో మాదిరిగానే హౌస్ లోని ఇంట్లో వాళ్లందరికీ జాతకాలు చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే అంతుకు ముందు వారాల్లో ఓ టాస్క్ లో భాగంగా భోలె షవాళి జాతకం చెప్పగా... ఇప్పుడు అమర్ దీప్ ను స్వామీజీని చేసేశాడు బిగ్ బాస్. అమర్ దీప్ లోని టాలెంట్ ను అంతా పిండేయాలనే ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా అమర్ దీప్ కూడా ఇరగదీశాడు.

Do You Know The Reason Behind Amardeep Get in Top 5 of Bigg Boss Telugu 7

ముఖ్యంగా నామాలు పెట్టుకుని స్వామీజీలా తయారయ్యాడు. మెడలో టవల్ వేసుకుని ఓ చోట కూర్చున్నాడు. చేతిలో బూతద్దం పెట్టుకుని మరీ అసలైనా జతకాలు చెప్పే వ్యక్తిలా ముస్తాబయ్యాడు. ఇంట్లో వాళ్లందరికీ జాతకాలు చెప్పేందుకు సన్నద్ధం అయ్యాడు. ముందుగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను పిలిచాడు. ఆయన రాగానే కాళ్లకు దండం పెట్టుకోమంటూ తన కాళ్లపైకి వంచాడు. పల్లవి ప్రశాంత్ కూడా ఏమాత్రం ఫీలవ్వకుండా అమర్ దీప్ స్వామికి దండం పెట్టాడు. ఆ తర్వాత ముందు కూర్చుని జాతకం చెప్పించుకున్నాడు.

ఈక్రమంలోనే అమర్ దీప్ నీది పెద్దదిరా... నీది చాలా పెద్దది అంటూ రైతుబిడ్డపై కామెంట్లు చేశాడు. ఆ తర్వాత శివాజి అంత పెద్దదా అనగానే... అవును చాలా పెద్దది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టాడు. ఆపై అరచేతిపై చూడాల్సింది పోయి మట్టపై చూస్తూ మరీ... రైతుబిడ్డ గురించి చెప్పుకొచ్చాడు. నీకు నీ పొలంలో ఓ తాబేలు దొరికింది కదా అని అనగానే... ఓ హో నువ్వు చూసినవా అన్నా అంటూ పల్లవి ప్రశాంత్ అడిగాడు. దానికి అమర్ దీప్ గట్టిగా నవ్వాడు. దానికి చర్చించకుండానే... జాతకం చెప్పడాన్ని కొనసాగించాడు.

Do You Know The Reason Behind Amardeep Get in Top 5 of Bigg Boss Telugu 7

ఆ తాబేలుతోనే నీకు మంచిగా కలిసొచ్చిందని అన్నాడు. దానివల్లే నీవు ఇక్కడ వరకూ వచ్చావంటూ వివరించాడు. ఇక్కడి వరకు అంటే టాప్ 5కి అని అర్థం. నిజంగానే రైతుబిడ్డకు ఆ తాబేలు వల్లే లాభం చేకూరిందా అంటే చెప్పలేం. కానీ ఓక కామన్ మాన్ గా వచ్చి విన్నర్ గా నిలిచే స్థాయికి వచ్చాడంటే ఎంతో లక్కు లేకుండా అయితే సాధ్యం కాదు. ముఖ్యంగా అమర్ దీప్ గొడవ రైతుబిడ్డకు చాలా ప్లస్ అయింది. ఈయనే విన్నర్ అవుతాడని పెద్ద చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X