బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా అవకాశం వచ్చినా వదులుకున్న కంటెస్టెంట్.. ఎవరు, ఎందుకో తెలుసా?

బిగ్‌బాస్ షోలో అవకాశం వస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతారో.. ఎంత పాపులర్ అవుతారో అందరికీ తెలిసిందే. గతంలో వారికి గుర్తింపు ఉన్నా లేకపోయినా... ఈ షో తర్వాత మాత్రం విపరీతమైన క్రేజ్ ను సంపాధించుకుంటారు. వారు చక్కగా గేమ్ ఆడితే మాత్రం వారి లెవెల్ మరింతగా పెరిగిపోతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం గేమ్ ఆడడం బిగ్ బాస్ షోలో పాల్గొనడం మాత్రమే కాకుండా బిగ్ బాస్ బజ్ షోలో హోస్ట్ గా ఛాన్స్ తెచ్చుకోవడం కూడా కాస్త కష్టమే. ఈ సీజన్ లో పాల్గొన్న వాళ్లను వచ్చే సీజన్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు.

అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోకు మాత్రం గత సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ గీతూ రాయల్ ను హోస్ట్ గా తీసుకున్నారు. అయితే తన ప్రశ్నలతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపించిన ఈ బ్యూటీ ఈ సీజన్ బజ్ హోస్ట్ కు ఫస్ట్ ఛాన్స్ కాదట. ముందుగా ఈ సారి బజ్ కోసం వేరే వ్యక్తిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ అతడు నో చెప్పడంతో ఈ ఆఫర్ గీతూ రాయల్ వద్దకు వెళ్లింది. ఆమె ఓకె చెప్పడం, బిగ్ బాస్ బజ్ లో దుమ్మురేపడం జరిగింది. అయితే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know The Reason Behind Bigg Boss Telugu 6 Contestant Aadi Reddy Say no to Host Bigg Boss Buzz

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 షోకు కామన్ మాన్ గా వచ్చిన.. బిగ్ బాస్ రీవ్యూయర్ ఆదిరెడ్డి అందిరకీ గుర్తుండే ఉంటాడు. అయితే అద్భుతమైన ఆట తీరును కనబర్చి టాప్ 5కు వెళ్లాడు. టాప్ 4 కంటెస్టెంట్ గా నిలిచిన అనేక మంది ఫాలోవర్లను సంపాధించుకున్నాడు. అయితే గత సీజన్ లో పాల్గొన్న ఈయనకు నెక్స్ట్ సీజన్ బజ్ హోస్ట్ గా అవకాశం ఇచ్చారట. కానీ ఆదిరెడ్డి మాత్రం నిర్మొహమాటంగా దాన్ని తిరస్కరించారట. తాను హోస్ట్ చేయనను, అలాంటి ఆలోచన కూడా లేదని వివరించారట. అయితే అందుకు గల కారణాలను కూడా తెలిపారు ఆదిరెడ్డి.

బిగ్ బాస్ షోపై రీవ్యూలు చేస్తూ తాను గుర్తింపు తెచ్చుకున్నానని.. సీజన్ 6లో పాల్గొనడంతో ఆ ఏడు రీవ్యూలు చేయడం కుదర లేదని వివరించాడు. ఇక ఆ తర్వాత సీజన్ కు కూడా రీవ్యూలు చేయకపోతే తను యూట్యూబ్ కనుమరుగైపోతుందని... తన జీవితం అనుకున్న, తనకు రోజూ పనిని ఇస్తున్న దాన్ని వదులుకోలేక ఆదిరెడ్డి బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేయనని చెప్పారట. అలాగే బజ్ లో హోస్ట్ గా చేస్తే వచ్చే డబ్బుల కంటే కూడా రీవ్యూలు చేస్తేనే ఎక్కువ వస్తాయని.. తాను గతంలో చాలా కష్టాలు అనుభవించానని.. అలాంటివి మళ్లీ రాకూడదు అంటే తన పని తాను చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Do You Know The Reason Behind Bigg Boss Telugu 6 Contestant Aadi Reddy Say no to Host Bigg Boss Buzz

అందుకో బజ్ హోస్ట్ గా చేయకుండా రీవ్యూలు చేసుకున్నానని.. అలా మూడు నెలల పాటు రీవ్యూలు చేస్తే మొత్తం 39 లక్షల రూపాయలు వచ్చాయని పేర్కొన్నాడు ఆదిరెడ్డి. అయినా తనకు బిగ్ బాస్ షోపై రీవ్యూలు చేయడం చాలా ఇష్టమని అందుకే ఆ పనే చేసుకుంటూ హాయిగా గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. రాబోయే సీజన్ లపై కూడా తాను రీవ్యూలు చేస్తానని స్పష్టం చేశాడు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X