హైపర్ ఆదికి ఇప్పటి వరకు పెళ్లి కాకపోవడానికి అసలు కారణం అదేనట.. తొలిసారి రివీల్!
జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటి సంపాధించుకున్న హైపర్ ఆది గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే తొలిసారి ఆయన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పారు. ముఖ్యంగా ఆయన జాతకంలో దోషం ఉండడం వల్లే పెళ్లి చేసుకాలేదని అన్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ షోలో అదిరిపోయే పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు హైపర్ ఆది. ఆయన వేసే స్పాంటేనియస్ పంచులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బీటెక్ చేసిన ఈయన సినిమాల మీద ఉన్న పిచ్చితోనే సినీ రంగంలోకి వచ్చాడు. జబర్దస్త్ షోలో ఒక్క ఛాన్స్ ఇవ్వగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని తెగ సందడి చేస్తున్నాడు. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న ఈయన అనేక షోలలో కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు.

ఒకప్పుడు జబర్దస్త్ షోలో మాత్రమే కనిపించిన ఈయన ఇప్పుడు ఢీ జోడీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా యాంకర్ కమ్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నారు. అక్కడే తన పెళ్లికి సంబంధించిన అసలు విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన ఇంతకాలం పెళ్లి చేసుకోకపోవడానికి గల కరాణాలను వివరించారు. పెళ్లి బట్టల్లో వచ్చి మరీ ఆ విషయాన్ని తాగుబోతు రమేష్ తో చెప్పించారు.
ముఖ్యంగా హైపర్ ఆదికి ఇంత కాలం పెళ్లి కాకపోవడానికి అసలు కారణం ఆయన జాతకంలోని దోషమేనట. ఆది జాతకంలో ఉన్న దోషం వల్లే ఆయనకు పెళ్లి కావట్లేదని.. ఈయనకు పెళ్లి కావాలంటే ముందుగా ఓ వృద్ధురాలిని పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అయితే తనను పెళ్లి చేసుకోవడానికి ఏ ముసలావిడ కూడా ఒప్పుకోకపోవడంతో తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేడని వివరించారు. ఇలాంటి విషయాలు చెప్పి షాక్ ఇచ్చిన తాగుబోతు రమేష్ పై హైపర్ ఆది అనేక పంచులు వేశారు.

ఈక్రమంలోనే హైపర్ అదికి ఎలాగైనా సరే పెళ్లి చేయాలని.. ఓ ఇద్దరు వృద్ధురాళ్లను తీసుకు వచ్చాడు రమేష్. కానీ వారు ఆదికి నో చెప్పడంతో అంతా తలలు పట్టుకున్నారు. కొందరు మాత్రం కడుపుబ్బా నవ్వారు. అయితే ఇదంతా నిజ జీవితంలో జరిగింది కాదులెండి. స్కిట్ లోనే భాగంగానే హైపర్ ఆది, రమేష్ లు ఇలా చేశారు. వాస్తవానికి హైపర్ ఆది ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ పెళ్లి కాకపోవడానికి కారణం మాత్రం దోషకం వంటివి కాదు. కేవలం స్కిట్ కోసం మాత్రమే ఆయన ఇదంతా చేశారు.


Click it and Unblock the Notifications











