Sivaji: అమర్‌దీప్‌ను ఆ ప్రశ్న అడగ్గానే రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన శివాజీ, ఎందుకంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్పై, స్పా బ్యాచ్ ల గురించి, ఆ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల గురించి అందరికీ తెలిసిందే. శివాజీ, అమర్ దీప్ మధ్య ఉన్న బంధం.. గొడవలు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో చాలా ప్రత్యేకంగా నిలిచాయి. అయితే ఎప్పటిలాగే శివాజి.. అమర్ దీప్ బిహేవియర్ చూసి షాకయ్యాడు. అతడిని ఓ ప్రశ్న అడగ్గానే రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న అమర్ దీప్, శివాజిలు మాట్లాడుకున్నప్పుడు చాలా సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ వారిద్దరికీ పడదు. ముఖ్యంగా శివాజీ అయితే అమర్ దీప్ ను చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నట్లు అనిపిస్తుంటుంది. పిల్లాడిలా భావించి చాలా కామెంట్లు చేస్తాడు. తిట్టడం దగ్గర నుంచి విపరీతంగా ఫైర్ అవ్వడం వరకూ అంతా విచిత్రంగానే అనిపిస్తుంటుంది. చాలా మాటలు జార విడిచాడు శివాజి.

 Do You Know The Reason Behind Sivaji Left With His Hands in Both Pockets When Amardeep Was Asked That Question

బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే.. శివాజి చాలా సార్లు అమర్ దీప్ పై నోరు పారేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. వాడు నా తమ్ముడిలా, చిన్న పిల్లాడిలా అనిపించే అలా మాట్లాడానని అన్నారు. వాడు చేసే తప్పులను వాడికి చెప్పాలనే అలా అన్నాను అంటూ కవర్ చేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ తర్వాత వీరిద్దరూ ఒక్కచోట ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ తాజాగా వీరిద్దరూ ఒకే స్టేజీపై కనిపించారు. అదేంటో ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బీబీ ఉత్సవం అనే షో ద్వారా... బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్లు అందరినీ ఒకే స్టేజీ మీదకు తీసుకు వచ్చారు. ఈక్రమంలోనే వారికి అన్నీ ఫన్నీ టాస్కులు ఇచ్చారు. ముఖ్యంగా అమర్ దీప్ తో ఓ అద్భుతమైన గేమ్ ఆడించారు. ఆయన మెమోరీ పవర్ ను చెక్ చేసేందుకు ఓ స్పెషల్ గేమ్ పెట్టగా.. ఎప్పటిలాగే బిక్కమొహం వేశాడు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి ఆ క్వశ్చన్ ను స్క్రీన్ పై రివీల్ చేసింది.

 Do You Know The Reason Behind Sivaji Left With His Hands in Both Pockets When Amardeep Was Asked That Question

తడిచిన ఒక చీర 30 నిమిషాల్లో ఆరుతుందని.. మొత్తం 30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. దీనికి అమర్ దీప్ ఆలోచనలో పడ్డాడు. చాలా షాకింగ్ గా మొహం పెట్టి దిక్కులు చూశాడు. దీంతో శివాజి అది భరించలేక రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అక్కడి నుంచి స్టేజీ కిందకు వచ్చాడు. ఎవరితో మాట్లాడకుండా అలా వెళ్లిపోతూ కనిపించాడు. ఇది గమనించిన కంటెస్టెంట్లు అంతా ఆయన వెనక పరిగెట్టారు. ఇలా ఈ ప్రోమో ముగిసిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X