Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ బిగ్ ప్లాన్.. ఉల్టాపుల్టా కాన్సెప్ట్‌కు కారణం అదే.. అసలేం జరుగుతోంది?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. అద్భుతమైన కాన్సెప్ట్ తో అందరినీ అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఉల్టాపుల్టా అంటూ వచ్చి తమకు నచ్చినట్లుగా చేస్తున్నారు బిగ్ బాస్. అయితే కేవలం ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కల్గించడానికి.. ప్రతీ క్షణం ట్విస్ట్ లు ఇవ్వడానికే ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తీసుకు వచ్చారని అంతా అనుకున్నారు. కానీ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తీసుకు రావడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ టీం నిర్వాహకులు చేసిన ఈ ప్లాన్ నిజంగా అదుర్స్ అంటూ చెప్పుకొస్తున్నారు.
ముఖ్యంగా ముందుగా 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. అందులో స్టార్ మా బ్యాచ్ కు చెందిన ముగ్గురు సీరియల్ నటులు ఉన్నారు. వీళ్లలోనే ఒకరు విన్నర్ అవుతారని అంతా అనుకున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ యే కప్పు కొడతాడని ప్రతీ ఒక్కరూ భావించారు. కానీ అమర్ దీప్.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకోవడం.. జనాల్లో తీవ్ర స్థాయిలో నెగిటివిటీ రావడంతో అతను కప్పు కొట్టే అవకాశామే లేదని తేలిపోయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ముద్దు బిడ్డలు అయిన శోభా శెట్టి, ప్రియాంక జైన్ లపై బిగ్ బాస్ దృష్టి పెట్టారు.

ఈ సీరియల్ బ్యాచ్ కు చెందిన వారిని గెలిపించుకునేందుకు బిగ్ బాస్ టీం నిర్వాహకులు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారని కూడా పుకార్లు వచ్చాయి. ఓవారం అయితే శోభాశెట్టి కచ్చితంగా వెళ్లిపోతుందని అంతా అనుకునేలోపే ఆమెను కెప్టెన్ చేసి బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. శోభా కూడా తీవ్ర స్థాయిలో అగ్రెసివ్ అవ్వడం.. అందరిపై నోరు పారేసుకోవడంతో... మరో టైటిల్ ఫేవరెట్ అయిన ప్రియాంక జైన్ కు మద్దతుగా బిగ్ బాస్ టీం నిర్వాహకులు గేమ్ ప్లే చేస్తున్నారు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అంబటి అర్జున్ కు కూడా బిగ్ బాస్ సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు.
అంబటి అర్జున్ ఏమైనా తప్పులు చేసినా, తప్పుగా మాట్లాడినా కనీసం నాగార్జున కూడా ఆయన్ను ఏమీ అనట్లేదని.. ముఖ్యంగా అమర్ దీప్ విషయంలో ఆయన చేసిన కామెంట్లను కనీసం చర్చలోకి కూడా తీసుకురాలేదని చాలామంది అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంబటి అర్జున్ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశాడు. గత రెండు వారాలుగా ఆయన ప్రశాంత్ నే నామినేట్ చేస్తూ వస్తున్నాడు. కానీ బయట రైతుబిడ్డకు ఉన్న సపోర్ట్ చూస్తుంటే మాత్రం.. ఆయన టాప్ 5లో కచ్చితంగా ఉంటాడని అర్థం అవుతోంది.
అలాగే ఇప్పటికే బిగ్ బాస్ టీం విన్నర్ గా శివాజి నిలుస్తారని అంతా అనుకుంటూ ఉండగా... కనీసం టాప్ 5 లో అయినా సీరియల్ బ్యాచ్ వాళ్లను ఉంచాలని బిగ్ బాస్ భావిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అందుకే వాళ్లను బిగ్ బాస్ మొదటి నుంచి వీళ్లను కాపాడుకుంటూ వస్తున్నారని.. ఏమన్నా అంటే ఉల్టా పుల్టా అంటూ ట్విస్టులు ఇచ్చి మరీ తమకు నచ్చిన వాళ్లు ఆటలో కొనసాగేలా చేస్తున్నారని కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చిన వారిని కాపాడుకోవడానికి, గెలిపించుకోవడానికే ఈ ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తెచ్చారని కూడా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











