Nayani Pavani నీతోనే డ్యాన్స్ నుంచి నయని పావని తొలగింపు.. అసలు కారణం ఏంటంటే?

బిగ్ బాస్ బ్యూటీ నయని పావని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఉన్నది ఒక్క వారమే అయినా... తన గేమ్ తో అలరించింది. అయితే మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. తాజాగా నీతోనే డ్యాన్స్ 2.ఓ షోలో యావర్ కి జోడీగా ఎంట్రీ ఇచ్చింది. ఏమైందో తెలియదు.. ఇక్కడ కూడా మొదటి వారంలోనే వెళ్లిపోయింది. అయితే నయని పావని వెళ్లిపోవడానికి అసలు కారణం ఏంటో బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఊహించని విధంగా ఎలిమినేట్
సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ గా నయని పావని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ తెలుగు 7 షోలో వైల్డ్ కార్టు ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌజ్ కు వెళ్లిన మొదటి వారంలోనే అందరితో కలిసి పోయింది. ఇక ముఖ్యంగా శివాజీని ఫాదర్ గా భావించింది. అయితే అందరికంటే యావర్ తో క్లోజ్ గా ఉండటంతో వీరి మధ్య లవ్ ఉందని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ వీరి మధ్య లవ్ ట్రాక్ పెడుతాడు అనుకుంటే.. ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది.

Do you know the reason why Nayani Pavani left the Neethone Dance 2 O Full Details Here

ఆ షోకు గుడ్ బై
దీంతో నయని పావని వచ్చిన మొదటి వారానికి ఎలిమినేట్ అయిపోయింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. యావర్ తో కలిసి రీల్స్, డ్యాన్స్ చేస్తూ.. ఫేమస్ అయిపోయింది. ఇక తాజాగా నీతోనే డ్యాన్స్ 2.ఓ లో వీరు జంటగా అలరించారు. యావర్ కు జోడీగా నయని పావని చేసింది. అయితే ఏమైందో తెలియదు.. ఇక్కడ కూడా మొదటి వారానికే ఆ షోకు గుడ్ బై చెప్పేసింది.

యావర్ కు జోడీగా వాసంతి
ఇక నీతోనే డ్యాన్స్ షోకి యావర్ కు జోడీగా రావాల్సిన నయని.. ఆ షో నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానంలో యావర్.. మరో బిగ్ బాస్ బ్యూటీని తెచ్చుకున్నాడు. ఆమె ఎవరో కాదు.. బిగ్ బాస్ వాసంతి. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు యావర్ కోసం.. డ్యాన్స్ షో చిందులు వేస్తుంది. యావర్ కు నయని పావని హ్యాండిచ్చిందని అంతా అనుకున్నారు. ఇక ఈ వారం నుంచి యావర్ కు జోడీగా వాసంతి వచ్చి చేరింది.

Do you know the reason why Nayani Pavani left the Neethone Dance 2 O Full Details Here

దాని వల్లే షో నుంచి ఔట్...
అయితే వాసంతి, యావర్ జోడీ కూడా బాగానే ఉంది. అయితే నయని పావని తప్పుకోవడానికి అసలు కారణం ఏంటా అని అంతా అనుకుంటున్నారు. అయితే నయని తప్పుకోవడానికి అసలు కారణం ఆమె పర్సనల్ రీజన్స్ అని తెలుస్తోంది. పలు కారణాల వల్ల తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉండటం వల్లే ఈ షో నుంచి తప్పుకుందని మరో న్యూస్ వినిపిస్తుంది.

జోడి బాగుందంటూ...
ఈ విషయం తెలుసుకున్న నయని, యావర్ ఫ్యాన్స్.. మీ జోడి బాగుందని... మీరు చేస్తేనే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మీ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అంటున్నారు. మరి చూడాలి.. నెక్ట్స్ వీక్ నుంచి వస్తుందా లేదా వాసంతి కంటిన్యూ చేస్తుందా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X