బిగ్‌బాస్ ఓటీటీ 2.. కంటెస్టెంట్లు ఫైనలయ్యేలోపే క్యాన్సిల్.. అసలు కారణం ఏంటంటే?
బిగ్ బాస్ తెలుగు షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాకుతోందీ రియాల్టీ షో. అందరినీ తెగ అలరిస్తూ.. రచ్చ లేపుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంటూ.. అన్ని భాషల్లో సక్సెస్ అవుతోంది. ముఖ్యంగా తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాధించుకున్న ఈ షో ఇటీవలే 7వ సీజన్ పూర్తి చేసుకుంది. దాని తర్వాత ఓటీటీ సీజన్ 2 రాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇఫ్పడు ఓటీటీ సీజన్ 2 క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లు కూడా కన్ఫార్మ్ అయ్యే వరకు వచ్చిన ఈ షో ఎందుకు క్యాన్సిల్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఎప్పుడూ లేనంతగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో విపరీతమైన టీఆర్పీని సొంతం చేసుకుంది. ఈ ఊపులోనే బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఓటీటీ సీజన్ 2 ను ప్రారంభించబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2 నుంచే ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ చేసేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. గత సీజన్ లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లను ఈ సీజన్ లోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భోలె షావళి, నయని పావనిలను ఈ సీజన్ లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధం చేశారు. అలాగే మరికొంత మందిని కూడా కన్ఫార్మ్ చేసినట్లు టాక్ నడిచింది.

తెలగులో ఓ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రిచా పనయ్ ను, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషను, నటుడు భద్రం, డ్యాన్స్ మాస్టర్ యశ్, సింగర్ పార్వతిలను తీసుకు వస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే మిగతా కంటెస్టెంట్లను తీసుకు వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారట. కానీ ఓటీటీ సీజన్ అనగానే ఎవరూ ఆసక్తి చూపలేరట. గతంలో ఓటీటీ సీజన్ 1కు అందగా గుర్తింపు రాకపోవడంతో ఈసారి చాలా మంది కంటెస్టెంట్లు వచ్చేందుకు నో చెప్పారట. ఓటీటీ కాకపోతే వస్తామని కూడా వివరించారట. ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో నిర్వాహకులు లైట్ తీసుకున్నారట.

అలాగే ఈసారి సీజన్ ను నాగార్జున హోస్ట్ చేయట్లేదట. దీంతో బిగ్ బాస్ షోపై మరింత ఆసక్తి తగ్గిపోయింది. ఇలా ఫిబ్రవరి నుంచే ప్రారంభం కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన ఈ షో.. పలువురు కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యేదాకా వచ్చి క్యాన్సిల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బాస్ ప్రియులు అంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఓటీటీ సీజన్ క్యాన్సిల్ అయినా... బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో త్వరలోనే ప్రారంభం అయితే బాగుండని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











