Bigg Boss Telugu 7: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ సెవెన్ అట్టహాసంగా ప్రారంభమై ఇప్పటికే రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకోంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్ లో ఎంతమంది ఉన్నా పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే రైతుబిడ్డ అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. అతని ఆస్తి పాస్తులు వివరాలు.. ఎంత ఏమిటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బిగ్ బాస్ మొదటి సీజన్ కాదు.. కానీ రెండో సీజన్ నుంచి కామన్ మ్యాన్ అనే పేరుతో ఊరు పేరు తెలియని వ్యక్తిని హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న వ్యక్తి. అయితే సోషల్ మీడియాకి దూరంగా ఉండే వారికి మాత్రమే ఎవరో తెలియదు. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ లోకి తను తీసుకోవాలని రైతుల కష్టాలు అందరికీ తెలియజేస్తానని సింపతి కొట్టే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉండే అతన్ని హౌస్ లోకి తీసుకొచ్చారు.

తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి అతను రైతుబిడ్డ అని మరిచిపోయి అమ్మాయిలకు పులిహార కలిపి లవ్ లో పడేసే ప్రయత్నం చేశాడు. ముందుగా ఒకరిద్దరితో పులిహోర కలిపినా సరే చివరికి రతిక అనే అమ్మాయితో ఫిక్స్ అయ్యాడు. ఆమె కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించినట్టు కనిపించడంతో ఆమెతో ప్రేమాయణం నడిపే ప్రయత్నం చేశాడు. కానీ మొదటివారం నామినేషన్స్ లో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ సంగతి అలా ఉంచితే ప్రశాంత ఆస్తిపాస్తులు వివరాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.

అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న సరే వారి కుటుంబం కాస్త డబ్బులు ఉన్న కుటుంబమేనని తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ కి సుమారు 26 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెబుతున్నారు. సొంత గ్రామంలో ఒక పెద్ద నివాస గృహంతో పాటు ఒక ఖరీదైన లగ్జరీ కారు కూడా అతనికి ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌజ్ కు రాకముందే అతని కుటుంబం కాస్త డబ్బులు ఉన్న కుటుంబమే అయితే సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చిన తర్వాత ప్రశాంత్ కూడా సంపాదించడం మొదలుపెట్టాడు. అయితే మార్కెటింగ్ మాత్రం చేయడని ఎవరిని ప్రమోషన్స్ చేయడం కూడా అతనికి ఇష్టం లేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇంతలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి.


Click it and Unblock the Notifications











