Bigg Boss Telugu 7: షోలో బోలే వికృత చేష్టలు.. వారానికి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే మొదట 14మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అయితే మామూలుగా ఏ సీజన్ లో అయినా 20 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. ఈసారి ఉల్టా పుల్టా కాబట్టి మొదట 14 మంది ఎంటర్ అవ్వగా... తర్వాత 5 మంది కొత్త కంటెస్టెంట్స్... వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక వారిలో మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి ఒకరు. అయితే ఈయన హౌజ్ లో వింతగా ప్రవర్తిస్తున్నాడు అని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఈయన రెమ్యూనరేషన్ ఎంత.. బిగ్ బాస్ ఇతనికి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతుంది. మొదట 14 మంది కంటెస్టెంట్స్ షోలో అడుగుపెట్టారు. ఇక అందులో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం సారి షకీలా, మూడో వారం సారి దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఇక ఐదో వారం శుభ శ్రీ ఇలా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ విషయం పక్కన బెడితే.. ఐదో వారం మరో ఉల్టా పుల్టా జరిగిన విషయం తెలిసిందే.

ఐదో వారం బిగ్ బాస్ షోలోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అందులో సీరియల్ యాక్టర్ అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తి, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ నయని పవని, మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి ఉన్నారు. ఇక బోలే షావలి ఎన్నో సినిమాలకు, జానపద పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. అంతే కాదు.. ఆయన ఎన్నో పాటలు పాడారు కూడా. తెలుగు సూపర్ హిట్ సినిమాల్లో ఆయన గాత్రంతో ఎన్నో పాటలు అలపించారు.
ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన బోలే హౌజ్ మెంబర్స్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అంతే కాదు ఆయన సంబంధం లేకుండా మాట్లాుతున్నాడు. దానికి తోడు.. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ తో అదే పనిగా పులిహోర మిక్స్ చేస్తున్నాడు. అశ్వినిని హీరోయిన్ గా పెట్టి.. అతను హీరోగా ఓ సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకువచ్చాడు. అంతే కాదు పూజా మూర్తి బుగ్గలు గిల్లుతూ... ఏదో వింతగా మాట్లాడాడు. ఆమె ఇబ్బందిగా ఫీల్ అయినా పట్టించుకోకుండా బిహేవ్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ లో భోలే షావలి మెజారిటీ సభ్యులకు నచ్చడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే భోలే పేరు చెప్పినా చిరాకు ఎక్స్ ప్రెషన్ పెట్టేస్తున్నారు. భోలే షావలి హౌస్ లోకి వచ్చేటప్పుడు తనని తాను పాట బిడ్డగా పరిచయం చేసుకున్నాడు. హౌస్ లో రైతు బిడ్డ ఉన్నాడు.. నేను పాట బిడ్డను అని చెప్పాడు. వాళ్లు ఇద్దరు ప్రకృతి నుంచి వచ్చిన వాళ్లేనని.. అన్నం కూరలా కలిసిపోతాం అన్నాడు. అయితే లేడీ కంటెస్టెంట్స్ ప్రవర్తించే తీరు మాత్రం వాళ్లకే కాదు.. చూసేవాళ్లకు కూడా నచ్చడం లేదు.
ఇక ఈయనగారికి బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే. బోలేకు బిగ్ బాస్ వారానికి రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆయన నాలుగు వారాలు ఉన్నా... 10 లక్షలు ఈజీగా వెనకేసుకోవచ్చు. మరీ ఆయన ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











