Bigg Boss Telugu 7 Finale: గ్రాంఢ్ ఫినాలేకు హ్యాండిచ్చిన కంటెస్టెంట్లు.. ఎవరు, ఎందుకు రాలేరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఈరోజుటితో పూర్తి అయిపోయింది. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవగా.. అమాయకపు అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. అలాగే టాప్ 3లో శివాజి, టాప్ లో ప్రిన్స్ యావర్, టాప్ 5లో ప్రియాంక జైన్, టాప్ 6లో అంబటి అర్జున్ లు నిలిచారు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫినాలే ఎపిసోడ్ కు చాలా మంది గెస్టులు వచ్చారు. ముఖ్యంగా హౌస్ లోకి ఈ సీజన్ 7 షోలో పాల్గొన్నా చాలా మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఒక్క ఇద్దరు తప్ప. అయితే ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు, వారు ఎందుకు రాలేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7షోలో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఒక్కొక్కరూ ఒక్కో వారం ఎలిమినేట్ అయిపోతూ.. బిగ్ బాస్ ఇంటికి గుడ్ బై చెప్పేశారు. ముఖ్యంగా అద్భుతమైన టాస్క్ లు ఆడుతూ... అంతకు మించి గేమ్ లు ఆడుతూ రచ్చ చేశారు. ఎలిమినేట్ అయిపోయి వెళ్లిన వాళ్లంతా ఈరోజు బిగ్ బాస్ ఫినాలే స్టేజీ మీదకు వచ్చారు. ముఖ్యంగా సింగర్ ధామిని, రతికా రోజ్, అశ్విని శ్రీ, సందీప్ మాస్టర్, భోలె షవాళి, నయని పావని, శోభా శెట్టి, టేస్టీ తేజ, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణలు గ్రాండ్ ఫినాలేకు వచ్చి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

అదిరిపోయే పాటలకు స్టెప్పులు వేస్తూ వచ్చారు. షో మొత్తం అయిపోయే వరకు ఉండి తమకు ఇచ్చిన టాస్క్ లు ఆడారు, అలాగే హౌస్ లోని ప్రతీ కంటెస్టెంట్ కు నాగార్జున ఏదో ఒక అవార్డు ఇచ్చారు. వారికి ఈ జర్నీ జీవితాంతం గుర్తుండిపోయేలా చేశారు. ఇలా ఆద్యంతం ఆకట్టుకుని.. విన్నర్, రన్నరప్ లను ప్రకటించారు. ఇంత చక్కగా సాగిన బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కు మాత్రం షకీలతో పాటు కిరణ్ రాథోడ్ లు రాలేదు. అయితే వారు ఎందుకు ఈ ఫినాలేకు రాలేదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
షకీలా వాస్తవానికి ముంబైలో ఉంటారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ఆమె ఇక్కడి వరకూ రావడానికి ఇష్టపడలేదట. ముఖ్యంగా కేవలం రెండు వారాలు మాత్రమే ఇంట్లోఉన్న ఆమెకు.... హౌస్ లో ఉన్న వారితో అంతగా కనెక్షన్ కూడా లేదు. దీంతో ఇక్కడి వరకు వచ్చి తాను అంతగా ఎంజాయ్ చేయలేనని.. రాలేదని తెలుస్తోంది. ఇక కిరణ్ రాథోడ్ కూడా మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. ఇంట్లో వాళ్లతో తనకు పెద్దగా కనెక్షన్ కూడా రాకముందే ఆమె ఇంట్లోంచి వెళ్లిపోవడం.. చాలా దూరం నుంచి రావడం ఇష్టం లేకే ఆమె కూడా బిగ్ బాస్ ఫినాలేకు రాలేదట. అయితే ఈ కారణాలే నిజమైనవా లేకా వారికి ఇంకా ఏమైనా పనులు ఉండే రాలేరా అనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











