Bigg Boss Telugu 7: పైసా ఖర్చు లేకుండా పల్లవి ప్రశాంత్‌ను పైకి లేపుతున్న కంటెస్టెంట్.. ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. 11వ వారంలో నామినేషన్లలో భాగంగా విపరీతమైన గొడవలు జరగ్గా... మరోసారి బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య గొడవ పెట్టాడు. సోమవారం నుంచి ఇంట్లో ఈ గొడవలు కొనసాగుతూనే ఉండగా... బుధవారం రోజు ర్యాంకింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ తో కంటెస్టెంట్లు మరింతగా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ మరీ తాము టాప్ ప్లేస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.
ముఖ్యంగా రతికా రోజ్ అయితే మరింతగా రెచ్చిపోయింది. నామినేషన్లలో కూడా ఫుల్ అగ్రెషన్ తో రచ్చే చేసిన ఈ క్యూట్ బ్యూటీ మరోసారి రైతుబిడ్డపై విరుచుకు పడింది. పల్లవి ప్రశాంత్ కు నీవు ఏ స్థానం ఇస్తావని హౌస్ మేట్స్ అంతా అడగ్గా.. ఏడో స్థానం ఇస్తానని చెప్పింది. అంత తక్కువ స్థానం ఎందుకు అని పల్లవి ప్రశాంత్ అడగ్గా.. ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. ముఖ్యంగా నువ్వు అసలు ఏం చేశావు.. మొదటి ఐదు వారాలు నీవు ఏం ఆట ఆడావు అంటూ అరిచింది. ముందు ఐదు వారాల్లో కేవలం నీవు నా వెనకాలే తిరిరాగావు.. రైతుబిడ్డగా వచ్చి కనీసం నాగార్జున సార్ ఇచ్చిన మొక్కను కాపాడుకోలేక పోయావంటూ ఫైర్ అయింది.

రతికా ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట చూసిన వ్యాఖ్యలను ఆమె మరోసారి మాట్లాడింది. ముఖ్యంగా రైతుబిడ్డ ఇలా అమ్మాయిల చుట్టూ తిరగడం తప్పు అంటూ వ్యాఖ్యానించింది. అలాగే ఇంట్లో ఏర్పడిన ఓ చిన్న సందర్భం వల్లల మీకు పాజిటివ్ గా మారింది గేమ్ అంటూ వివరించింది. అలాగే అదే తనకు మైనస్ అయిందని వాపోయిందని. తాను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ముందు వారాలతో పోలిస్తే తన స్వతహాగా గేమ్ ఆడినట్లు ఏం కనిపించలేదని ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ చెప్పే రూల్స్ కూడా నీకు అర్థం కావట్లేవంటూ అగ్రెషన్ చూపించింది.
ఇంతటితో రతికా రోజ్ ఆగకుండా.. శివన్నం ఏం చెప్పమంటే అది చెబుతున్నావు, అలాగే గేమ్ ఆడుతున్నావు, నామినేషన్స్ లో కూడా నీ ఇష్టం వచ్చినట్లుగా గేమ్ ఆడుతున్నావంటూ చెప్పుకొచ్చింది. అలాగే నీవు బిగ్ బాస్ ఇంట్లోకి ఒక కామన్ మ్యాన్ లా ఎంట్రీ ఇచ్చావంటూ తెలిపింది. సెలబ్రిటీకి ఒక కామన్ మ్యాన్ సపోర్ట్ కావాలిని స్పష్టం చేసింది. అయితే ఒక కామన్ మ్యాన్ గా ఇంట్లోకి అడుగు పెట్టిన నీకు కామన్ మ్యాన్ సపోర్ట్ ఎక్కువగా ఉందని... కానీ నువ్వు మాత్రం అసలు గేమ్ యే ఆడలేదంటూ చెప్పుకొచ్చింది.

ఇలా రతికా రోజ్.. పల్లవి ప్రశాంత్ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇదంతా చూస్తుంటే ఇది రతికాకు చాలా మైనస్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. రతికా రోజ్ అన్న మాటలకు.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె అన్న మాటలు, చేసిన తప్పులు అన్నీ మరోసారి చెప్పాడు. దీంతో రైతుబిడ్డకు మరోసారి సపోర్ట్ వస్తుందని అర్థం అయిపోతుంది. ఇప్పటికే ఓసారి నెగిటివిటీ సంపాదించుకుని ఎలిమినేట్ అయిన రతికా రోజ్.. రెండోసారి కూడా అదే తప్పు చేసిది. ఇదంతా చూస్తుంటే ఆమె కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని.. బిగ్ బాస్ ఏదైనా మాయ చేసి ఉంచితే మాత్రం చెప్పలేమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











