Sudigali Sudheer: పెళ్లి కాకుండానే తండ్రి అయిన సుడిగాలి సుధీర్.. కూతురు ఎవరో కాదు ఆ నటే!
సుడిగాలి సుధీర్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన ప్రస్తుతం హీరోగా మారాడు. సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే గతంలో రష్మితో లవ్ ట్రాక్ నడుపుతూ... విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ముఖ్యంగా ఈయన కూతురు కూడా బుల్లితెరపై అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. అయితే సుధీర్ కూతురు ఎవరు, ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు మేజిక్ షోలు చేస్తూ.. ఆ తర్వాత కమెడియన్ గా మారిన సుడిగాలి సుధీర్.. పదేళ్ల పాటు యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ సాగించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీం లీడర్ గా మారి, యాంకర్ గా కూడా మారాడు. ఇలా బుల్లితెరపై అనేక షోలలో కనిపిస్తూ రచ్చ చేసిన ఈయన.. హీరోగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం కాస్త బ్రేక్ ఇచ్చిన ఈయన మరోసారి యాంకర్ గా మారి ఆహాలో సర్కార్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇలా బుల్లితెరపై, వెండితెరపై కనిపిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న ఈయన తాజాగా పెళ్లి కాకుండానే తండ్రిగా మారినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సుడిగాలి సుధీర్ చాలా ఏళ్ల క్రితం.. యాంకర్ విష్ణు ప్రియతో కలిసి పోవే పోరా అనే షో చేసేవాడు. కాలేజీ పిల్లలను రప్పించి.. కామెడీ గేమ్స్ తో సరదాగా సాగించిన ఈ షో ద్వారానే వాళ్లు చాలా క్లోజ్ అయ్యారు. ముఖ్యంగా తండ్రి లేని యాంకర్ విష్ణు ప్రియకు సుధీర్ చాలా దగ్గర అయ్యాడు. ఆమె గురించి అన్నీ పట్టించుకునే వాడు. ఆ షోలో ఏర్పడిన స్నేహం ఇప్పటికీ కొనసాగుతుంది. సుధీర్ ఎవరితో కలిసి పని చేసినా వారితో చాలా చక్కగా ఉంటాడు. అయితే ఈక్రమంలోనే యాంకర్ విష్ణు ప్రియ ఇతడిని తండ్రిగా భావించినట్లు ఓ షోలో చెప్పింది.

కేవలం భావించడం మాత్రమే కాదు.. డాడీ, డాడీ అని పిలుస్తుంటుంది కూడా. అదే విషయాన్ని అందరి ముందు చెప్పిన విష్ణు ప్రియ తన తండ్రి తర్వాత.. తనను అంత ప్రేమగా చూసుకున్న మొదటి వ్యక్తి సుధీర్ అని, ప్రతీరోజూ తాను తిన్నానో, లేదో అడిగిన మొదటి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. తనతో పని చేసినంత కాలం తనను చాలా బాగా చూసుకున్నాడని... ఇప్పటికీ తమ స్నేహం కొనసాగుతుంది వివరించింది. ఇలా సుధీర్ పెళ్లి కాకముందే యాంకర్ విష్ణు ప్రియకు తండ్రిగా మారాడు.


Click it and Unblock the Notifications











