ఆ కంటెస్టెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి రోజూ బిగ్‌బాస్ చూసేవారట.. ఆ లక్కీ మ్యాన్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి అందరికీ తెలిసిందే. అందులో పాల్గొన్న మొత్తం 19 మంది కంటెస్టెంట్ల గురించి వారి బ్యాగ్రౌండ్ గురించి కూడా అంతా తెలుసకున్నారు. షో ప్రారంభం కాబోతుంది అన్నప్పటి నుంచే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ సాగిన ప్రచారం నుంచి చివర్లో విన్నర్ ఇతడేనంటూ లక్షలాది మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ 19 మంది కంటెస్టెంట్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకుంటూ నచ్చని వారు వెళ్లిపోతే బాగుండని కోరుకున్నారు. అందుకోసం ప్రతి రోజూ షో చూడడం.. ముఖ్యంగా ఓట్లు వేసి తమకు ఫేవెరట్ కంటెస్టెంట్ ను గెలిపించుకోవడం చేశారు.
ముఖ్యంగా ఈ సారి సీజన్ లో రెండు గ్రూపులు ఉండడం అందులో తమకు నచ్చిన గ్రూపుకే సపోర్ట్ చేయడం చేశారు జనాలు. ముఖ్యంగా స్పా, స్పై బ్యాచ్ లకు అయితే విపరీతమైన క్రేజ్ వచ్చింది. స్పా బ్యాచ్ లో ఉన్న శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ లు స్పా బ్యాచ్ గా.. చుక్క బ్యాచ్ గా, స్టార్ మా బ్యాచ్ గా, సీరియల్ బ్యాచ్ గా పేరొందారు. ఇక శివాజి, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లు స్పై బ్యాచ్ గా మారిపోయారు. ఈసారి పోటీ అంతా ఈ రెండు గ్రూపుల మధ్యే కొనసాగింది. ఇందులోంచే టాప్ 5 కెంటెస్టెంట్లు వస్తారని.. వీళ్లలోనే విన్నర్, రన్నర్ లు ఉంటారని అంతా ఊహించారు.

అయితే అంతా ఊహించినట్లుగానే ఈ సారి సీజన్ విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. రెండో స్థానంలో అమర్ దీప్.. ఇక మూడో స్థానంలో శివాజి ఉన్నారు. శివాజియే విన్నర్ గా నిలుస్తారని చాలా మంది భావించినప్పటికీ ఆ లెక్క తప్పింది. కనీసం రెండో స్థానంలో అయిన ఉండాల్సిందని కూడా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ తమకు నచ్చిన సీరియల్ నటుడు అమర్ దీప్ కే కావాలని రన్నర్ ను చేశారని చాలా మంది పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. ఇదే విషయం గురించి శివాజి మాట్లాడుతూ కూడా.. కావాలనే బిగ్ బాస్ తనను బ్యాడ్ చేశాడని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.
అయితే టాప్ 3లో నిలబెట్టినా తానేమీ ఫీల్ కావట్లేదని.. ఎంతో మంది ప్రజలు తనను విన్నర్ గా చూశారని, అదే విషయం తనకు చెబుతున్నారంటూ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. తన బిడ్డ లాంటి వాడు, కామన్ మ్యాన్ అయిన పల్లవి ప్రశాంత్ గెలవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అన్నికంటే ఎక్కువ సంతోషంగా అనిపించింది నాగార్జున అంతటి వారే.. తన మైండ్ గేమ్ బాగుందని షోలో చెప్పడం మరింత గర్వంగా అనిపించిందంటూ వెల్లడించారు. ఇక ఇవన్నీ మాట్లాడుతూనే మరో షాకింగ్ విషయం వెల్లడించాడు శివాజి.

ఇటీవలే తాను నటించిన ఓ వెబ్ సిరీస్ లాంచింగ్ కోసం.. విక్టరీ వెంకటేషన్ 75వ సినిమా సైంధవ్ కార్యక్రమానికి వెళ్లానని.. అక్కడ మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమాన నటుడు, అన్నయ్య కనిపించాడని చెప్పాడు. అయితే అప్పుడే చిరంజీవి తనతో మాట్లాడుతూ.. సురేఖ నేను ప్రతిరోజూ నీకోసం బిగ్ బాస్ షో చూశామని చెప్పారట. అది విన్న వింటనే ఏంటన్నయ్యా.. మీరు నాకోసం బిగ్ బాస్ రోజూ చూశారా అవునన్నారని... చాలా బాగా ఆడావు అని మెచ్చుకున్నట్లు తెలిపారు. ఈ మాటలు విన్న తర్వాత నాకు కప్పు కూడా అవసరం లేదనిపించిందని.. ఇంతకంటే నాకేం కావాలంటూ కామెంట్లు చేశారు.


Click it and Unblock the Notifications











