pavitra Jayaram: ఆ సీరియల్‌లో తమ్ముడిగా నటించినతనే పవిత్రా జయరాం భర్త.. భార్య మరణంపై షాకింగ్ పోస్ట్!

త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరామ్ నిన్న ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త షాకింగ్ పోస్ట్ పెట్టాడు. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నానంటూ వివరించాడు. ముఖ్యంగా పవిత్రా జయరామ్ నిజమైన భర్త ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. కానీ ఓ సీరియల్ లో తనకు తమ్ముడిగా నటించిన ఓ నటుడే.. ఆమె రియల్ లైఫ్ భర్త. అయితే అతడు ఎవరు, భార్య మృతిపై ఆయన చేసిన పోస్ట్ ఏంటి, కామెంట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మే 12వ తేదీ అంటే ఈరోజు నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కర్ణాటకకు చెందిన ఈమె హైదరాబాద్ లో ఉంటూ సీరియల్స్ లో నటిస్తోంది. అయితే తాజాగా ఈమె తన సొంతూరికి వెళ్లింది. అయితే తిరిగి హైదరాద్ వస్తుండగా.. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతల్లి డివైడర్ ను ఢీకొట్టింది. ఇది జరుగుతుండగానే.. కుడివైపు నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అలా రోడ్డు ప్రమాదానికి గురైన ఈమె ప్రాణాలు కోల్పోయింది.

Do You Know Who Is The Husband of Trinayani Serial Actor Pavitra Jayaram Check Detials

అయితే ఈమె మృతి విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ షాక్ అయ్యారు. నమ్మలేకపోతున్నాం, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఆమె మృతిపై భర్త స్పందించారు. అయితే ఆయన మరెవరో కాదు సీరియల్ నటుడు చంద్రకాంత్. వీరిద్దరూ కలిసి కూడా చాలానే సీరియల్స్ లో కలిసి నటించారు. త్రినయని సీరియల్ లో కూడా ఆయన పవిత్రా జయరామ్ కు తమ్మడుగా కనిపించాడు. రియల్ లైఫ్ లో భర్త అయిన అయిన రీల్ లైఫ్ లో మాత్రం తమ్ముడిగా చాలా కాలమే సందడి చేశాడు.

లేడీ విలన్ గా చేస్తున్న ఈమెకు తమ్ముడి పాత్రలో ఇరగదీసిన అతడే ఆమె భర్త అని తెలుసుకున్న తెలుగు ప్రజలు షాక్ అవుతున్నారు. ఆమెను నెట్టింట ఫాలో అవుతున్న వారికి తప్పు ఈ విషయం ఎవరికీ ఎక్కువగా తెలియదు. అందులోనూ అక్కా, తమ్ముళ్లుగా చేసిన వీళ్లు నిజజీవితంలో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. అయితే నిన్నటి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత తన భార్య చనిపోయిన విషయం తెలిసిందని.. అప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నానంటూ పోస్ట్ చేశాడు.

Do You Know Who Is The Husband of Trinayani Serial Actor Pavitra Jayaram Check Detials

పాపా నీతో దిగిన చివరి ఫొటో ఇదే రా అంటూ చల్లా చంద్రకాంత్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వివరించాడు. మీ మరణ వార్తను అస్సలే జీర్ణించుకోలేకపోతున్నాని.. నన్ను ఒంటరిగా వదిలి వెళ్లావనే వార్తను తట్టుకోలేకపోతున్నాని అన్నాడు. ఒకసారి మామా అని పులవే ప్లీజ్ అంటూ పవిత్రాజయరామ్ ను ట్యాగ్ చేశాడు. అలాగే మై పవి ఈజ్ నో మోర్ అంటూ ప్లీజ్ రా కమ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆయన బాధ పడుతూ, ఎడుస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X