Bigg Boss Telugu: యావర్ ఎవిక్షన్ పాస్ పోవడానికి కారణం ఆ కంటెస్టెంటే.. బయటకొచ్చిన సీక్రెట్ వీడియో!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ సీజన్ లోనూ చోటు చేసుకోని అనేక ట్విస్టులు ఈ సీజన్ లో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అద్భుతమైన టాస్క్ లతో పాటు అంతుకు మించిన ట్విస్ట్ లు ఇస్తూ.. అందరినీ షాక్ కు గురి చేస్తున్నారు. అయితే ఇటీవలే ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్ వద్ద నుంచి ఆ పాస్ ను తీసుకున్నారు. అయితే ఇందుకూ ఓ కారణం ఉంది. ఓ స్పెషల్ కంటెస్టెంట్ వల్లే యావర్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను కోల్పోవాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన ఓ సీక్రెట్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.. అయితే ఎవరి వల్ల ఇదంతా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
11వ వారంలో భాగంగా ముందుగా హౌస్ మేట్స్ అంతా ఏకాభిప్రాయంతో ర్యాంకులు సాధించుకోవాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగానే ఎవిక్షన్ పాస్ టాస్క్ నిర్వహించారు. ముందుగా బాటమ్ 5 లో ఉన్న వారే ఎవిక్షన్ పాస్ కోసం పోటీ పడతారని చెప్పగా.. అంబటి అర్జున్ గెలిచి ఎవిక్షన్ పాస్ ను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత.. మొదటి నుంచి 5వ ర్యాంకు వరకు ఉన్న వాళ్లతో స్పెషల్ గా పోటీ పడి ఆ ఎవిక్షన్ పాస్ ను దక్కించుకోవాలని చెబుతూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈక్రమంలోనే అర్జున్ తో పోటీ పడ్డ యావర్ గెలిచి మిగిలిన వాళ్లతో టాస్క్ లు ఆడాడు.

ముఖ్యంగా రెండు, మూడు రౌండ్లలో పల్లవి ప్రశాంత్, శోశాశెట్టి, శివాజి, ప్రియాంక జైన్ లతో గేమ్ ఆడాడు. చివరగా శివాజి, ప్రియాంకలతో గేమ్ ఆడిన యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. ఈ గేమ్ లో అనేక గొడవలు జరిగాయి. ముందుగా ప్రియాంక, శివాజిల బాల్స్ పడిపోగా... విన్నర్ గా యావర్ ను ప్రకటించారు. కానీ బిగ్ బాస్ రూల్స్ అధారంగా ప్రకటించాలని ఆదేశాలు రాగా... మళ్లీ అదే నిర్ణయాన్ని తెలిపారు. కానీ తర్వాత రోజు నాగార్జున వచ్చి పలు వీడియోలు చూపించాడు. ఇలా ఎవిక్షన్ పాస్ పొందడానికి ప్రిన్స్ యావర్ అర్హుడు కాదని చెప్పాడు.
ఈ క్రమంలోనే యావర్.. ఎవిక్షన్ పాస్ ను తిరిగి ఇచ్చేశాడు. ఎవిక్షన్ పాస్ కంటే కూడా తన క్యారెక్టరే ముఖ్యం అని వివరించాడు. అయితే ఇదంతా విన్న నాగార్జున హౌస్ మేట్స్ నిర్ణయం ఆధారంగా దీన్ని ఫైనల్ చేద్దామని చెప్పాడు. ఇందులో భాగంగానే యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందడానినకి అనర్హుడు అని అనుకునే వాళ్లు చేయి ఎత్తాలని సూచించాడు. దీంతో వెంటనే శోభాశెట్టి, అమర్ దీప్ లు చేయి ఎత్తారు. కానీ ముందుగా ప్రియాంక జైన్ మాత్రం అలాగే ఉండిపోయింది. తన స్నేహితురాలు చేయి ఎత్తట్లేదని వెంటనే చేయి ఎత్తాలంటూ ఎవరికీ తెలియకుండా భుజంతో రాస్తూ ప్రియాంక జైన్ కు సూచించింది.

శోభాశెట్టి చేసిన సిగ్నల్ అర్థం చేసుకున్న ప్రియాంక జైన్.. వెంటనే చేయి ఎత్తేసింది. ఇది ముందుగా చూస్తే పెద్దగా అర్థం కాలేదు కానీ.. కాస్త స్లో మోషన్ లో పెట్టుకుని చూస్తే మాత్రం ఈజీగా అర్థం అయిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రిన్స్ యావర్ ఎవిక్షన్ పాస్ పోవడానికి శోభా శెట్టియే కారణం అంటూ పెద్ద ఎత్తున రాసుకొస్తున్నారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఆ వీడియో చూసి మీ నిర్ణయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి .


Click it and Unblock the Notifications











