విరూపాక్ష సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్ చేసుకున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఎవరో తెలుసా?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్తా మీనన్ హీరోయిన్ గా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా విరూపాక్ష గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథతో వచ్చి అందినీ అలరించిన ఈ సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరికీ విపరీతమైన గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హీరోహీరోయిన్లతో పాటు, రవి, సోనియాలకు కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే హీరోగా ఈ సినిమాకు ముందుగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ ను తీసుకోవాలని డైరెక్టర్ అనుకున్నారట. కానీ చివరకు ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ చేతికి వెళ్లిందట. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గతేడాది వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విరూపాక్ష సినిమాను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ లు హీరోహీరోయిన్లుగా చేయగా.. బ్రహ్మాజీ, సాయి చంద్, సోనియా సింగ్, అజయ్, సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, కామాక్షి భాస్కర్ల, శ్యామల, రవికృష్ణ, మల్లెడి రవి కుమార్ వంటి వాళ్లంతా ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2023 ఏప్రిల్ 21న తేదీన విడుదల అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్ల వద్ద కాసుల వర్షం కురపించి మే 21వ తేదీ నుంచి ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో ముందుగా హీరోగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ ను తీసుకోవాలని డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు అనుకున్నారట.
ఈ సినిమా కథ ఎప్పుడో రాసి పెట్టుకోగా.. అందుకోసం ఓ హీరోను కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు శాసనం అని పేరు పెట్టాలని కూడా అనుకున్నారట. కానీ సినిమా నిర్మించేందుకు ప్రొడ్యూసర్ల కోసం వెతికారట. దాదాపు రెండేళ్ల పాటు ఈ కథతో హీరోతో పాటు డైరెక్టర్ అందరి చుట్టూ తిరగ్గా కథ ఓకే అయిందట. కానీ హీరోగా... డైరెక్టర్ అనుకున్న వ్యక్తిని తీసుకోవడానికి వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో కార్తీక్ వర్మ దండు.. ఆయన్ను హీరోగా తీసేసి.. సాయి ధరమ్ తేజ్ కు ఛాన్స్ ఇచ్చారట. అలాగే టైటిల్ ను కూడా విరూపాక్షగా మార్చారట.

అయితే ఇలా విరూపాక్ష సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుంది మరెవరో కాదు.. అంబటి అర్జున్. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఈయన సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా కూడా చేశారు. కానీ ఈ కొత్తవాడు కావడం, అంత ఫేమ్ లేకపోవడంతో.. ఈయనను హీరోగా పెట్టేందుకు ప్రొడ్యూసర్లు ఓకే చెప్పలేదట. అలా అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంబటి అర్జున్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు.


Click it and Unblock the Notifications











