Bigg Boss 7 Telugu: ఇది కదా ఉల్టా పుల్టా అంటే... 5వ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిస్తే షాకే?
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ స్టార్ట్ అయింది. అయితే ఈ సారి కేవలం 14మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్లారు. ఇక అందులో ఇప్పటికే నలుగురు( కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్) ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఆమెకు ఎక్కువ ఓట్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరు.. ఎందుకు కావాల్సి వచ్చిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం నుంచే ఊహించని ట్విస్టులు, షాకులు ఇస్తూ ఆకట్టుకుంటుంది. గత సీజన్స్ కంటే ఈ సారి సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అంతే కాదు.. ఊహకు అందకుండా ట్విస్టులు ఉంటున్నాయి. ఎప్పుడైనా బిగ్ బాస్ హౌజ్ లోకి 20 మందికి పైగా అడుగు పెడతారు. కానీ ఈసారి మాత్రం కేవలం 14మంది ఎంటర్ అయ్యారు. ఇక వారిలో ఇప్పటికే వారానికి ఒకరు చొప్పున మొత్తం నలుగురు ఎలిమినేట్ అయ్యారు.

ఇక హౌజ్ లో మిగిలింది 10 మంది. అందులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్ అయి.. సేఫ్ అయిపోయారు. ఇక మిగిలిన 9 మందిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని నెటిజన్స్ ఆరా తీశారు. ఇక ఈ వారం అంతా ఓటింగ్ పరంగా ప్రియాంక జైన్ ఔట్ అవుద్ది అనుకున్నారు. ఎందుకంటే.. ఆమెకు ఓట్లు తక్కువగా వచ్చాయి. కానీ బిగ్ బాస్ అందరికీ ట్విస్టు ఇస్తూ... మరో కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేశాడు.
ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు... శుభ శ్రీ రాయగురు. అదేంటి ఆమెకు ఓట్లు బాగానే వచ్చి ఉంటాయి అనుకుని ఉంటారు కదా.. .అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో 5వ వారంలో నామినేషన్స్ లో ఉన్నది.. తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్. అయితే వీరిలో డేంజర్ జోన్ లోఉన్నది ప్రియాంక, తేజ, అమర్ అంటూ ప్రచారం చేశారు. ఇక చాలా మంది వారికి ఓట్లు వేసి.. ఓటింగ్ పెంచుకున్నారు.
చాలా మంది కంటెస్టెంట్స్ పీఆర్ టీమ్స్ ఈ స్ట్రాటజీని ఉపయోగించి... ఓట్లను పెంచుకుంటారు. ఈ సారి కూడా వాళ్లు డేంజర్ జోన్ అంటూ ఓటింగ్ పెంచుకున్నారు. ఇక ఊహకు అందకుండా ఈసారి ఓటింగ్ తక్కువ రావడంతో శుభ శ్రీ రాయగురు ఎలిమినేట్ అయింది. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఇక ఈ వారం శుభ శ్రీ ఎలిమినేట్ అయితే.. హౌజ్ లో ఉండేది కేవలం 9 మంది. అయితే ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు బిగ్ బాస్ మినీ లాంచ్ ఉండబోతుంది. ఇందులో కొత్త కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వనున్నారు. ఈసారి 6 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వనున్నారని తెలుస్తోంది. ఇక వీరు హౌజ్ లోకి ఎంటర్ అయ్యాక ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకోనున్నాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











