22000 ఎపిసోడ్స్‌తో సుదీర్ఘంగా సాగిన టెలివిజన్ సీరియల్ ఏమిటో తెలుసా? తెలుగులో కార్తీకదీపం కాదు..!
వినోద రంగంలో బుల్లితెరపై ప్రదర్శించే సీరియల్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విశేషమైన ఆదరణ ఉంటుంది. టెలివిజన్‌పై వేలాది ఎపిసోడ్స్‌తో కొనసాగుతూ ప్రేక్షకుల కొత్త అనుభూతిని పంచుతుంటాయి. అయితే సీరియల్స్ సుదీర్గంగా సాగుతూ వందలాది ఎపిసోడ్స్ పూర్తి చేసుకొంటాయి. అలా సుదీర్ఘంగా సాగి రికార్డు స్థాయి ఎపిసోడ్స్‌తో సంవత్సరాలపాటు కొనసాగిన సీరియల్స్ వివరాల్లోకి వెళితే..
హిందీ సీరియల్స్ విషయానికి వస్తే.. సుదీర్ఘకాలం సాగిన సిరియల్స్‌లో తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా, యే రిస్తా క్యా కహ్లాతా హై ఉన్నాయి. తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా సిట్ కామ్ సోని సాబ్ ఛానెల్‌లో 4153 ఎపిసోడ్స్‌తో ముగిసింద. ఇక స్టార్ ప్లస్‌లో ప్రసారమైన యే రిస్తా క్యా కహ్లాతా హై ఈ సిరియల్ 4153 ఎపిసోడ్స్‌తో రికార్డు సృష్టించింది.

తమిళంలో సుదీర్ఘ కాలం సాగిన సీరియల్స్ విషయానికి వస్తే..చంద్రలేఖ సీరియల్ 8 సంవత్సరాలపాటు 2306 ఎపిసోడ్స్‌తో ముగిసింది. సన్ టీవీలో వల్లీ సీరియల్ 1960 ఎపిసోడ్స్, స్టార్ విజయ్‌లో శరవణమ్ మీనాక్షి 1901 ఎపిసోడ్స్, సన్ టీవీలో కల్యాణ పరిసు సీరియల్ 1840 ఎపిసోడ్స్ సాగింది. సన్ టీవీలోనే కొళంగల్, కస్తూరి సీరియల్స్ 1530 ఎపిసోడ్స్‌కుపైగా సాగాయి.

తెలుగు సీరియల్స్ వివరాల్లోకి వెళితే.. అభిషేకం, ఆడదే ఆధారం, మనసు మమత, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సుదీర్ఘంగా సాగాయి. ఈటీవీలో ప్రసారమైన అభిషేకం సీరియల్ 13 ఏళ్లపాటు కొనసాగితే.. ఆడదే ఆధారం 11 ఏళ్లపాటు, మనసు మమత 10 ఏళ్ల పాటు, అత్తారింటికి దారేది 8 ఏళ్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 7 ఏళ్లపాటు సాగింది.

తెలుగులో అభిషేక్ సీరియల్ అత్యధికం 4 వేల ఎపిసోడ్స్, ఆడదే ఆధారం 3329 ఎపిసోడ్స్, మనసు మమత 3305 ఎపిసోడ్స్, అత్తారింటికి దారేది 2344 ఎపిసోడ్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2152 ఎపిసోడ్స్, కుంకుమ పువ్వు 2000+ ఎపిసోడ్స్, కార్తీకదీపం 1569 ఎపిసోడ్స్ సాగాయి.

ఇక ప్రపంచంలో అతి సుదీర్ఘకాలం సాగిన సీరియల్ విషయానికి వస్తే.. సండ్‌మంచెన్ అనే యానిమేటెడ్ సీరియల్ దాదాపు 22 వేల ఎపిసోడ్స్‌తో సాగింది. ఈ సీరియల్ 1959లో మొదలైంది. ఇక అమెరికాలో ఫ్యామిలీ సిరియల్స్ గైడింగ్ లైట్ 15762 ఎపిసోడ్స్, జనరల్ హాస్పిటల్ 15 వేలకుపైగా ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఆలరించాయి.


Click it and Unblock the Notifications











