For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పరిటాల రవికి ఫోన్.. చెప్పులదండతో సన్మానం అంటూ వార్నింగ్.. ఓపెన్ అయిపోయిన డాక్టర్ బాబు!

  |

  తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు డాక్టర్ బాబు. మా టీవీలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో మెయిన్ లీడ్ పేరది. నటుడు నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఆయన పేరు మర్చి పోయి డాక్టర్ బాబు పేరుకి ఫిక్స్ అయిపోయారు.. తాజాగా ఆయన ఆలీతో సరదాగా షో లో పాల్గొన్నారు.. తన భార్య మంజులతో కలిసి ఈ షోలో పాల్గొన్న నిరుపమ్ కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  చంద్రముఖితో మొదలు

  చంద్రముఖితో మొదలు


  నటుడు, రచయిత అయిన ఓంకార్ పరిటాల వారసుడిగా టెలివిజన్ రంగంలో అడుగు పెట్టారు నిరుపమ్. తండ్రి పెద్దగా ప్రోత్సహించకపోయినా ఆయన చంద్రముఖి అనే సీరియల్లో లీడ్ రోల్ సంపాదించాడు. ఆ సినిమా చేస్తున్న సమయంలో అదే సీరియల్ లో లేడీ లీడ్ రోల్ చేస్తున్న మంజులతో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ వివాహం దాకా దారితీసింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన ఆలీతో సరదాగా షోలో పంచుకున్నారు.

  మొదటి సారి చూడగానే

  మొదటి సారి చూడగానే

  ఈ సందర్భంగా మొట్టమొదటిసారి నిరుపమ్ ను చూసినప్పుడు మంజుల ఫీలింగ్ ఏమిటి అని అలీ ప్రశ్నించారు.. అయితే మంజుల సమాధానం చెప్పలేదు కానీ నిరుపమ్ ఆసక్తికరంగా స్పందించాడు.. అప్పుడు చెన్నై నుంచి గుండుతో వచ్చానని, ఏరికోరి గుండుతో ఉన్న వాడిని ఎందుకు తీసుకు వచ్చారని ఆమె ఫీల్ అయి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మంజుల మాట్లాడుతూ ఆ సీరియల్ మొదటిది అనే సంగతి తనకు తెలియదని, తనకు అంటే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకొచ్చింది. అయితే అదే తనకు ప్లస్ అయిందని బహుశా మొదటిసారిగా సీరియల్ చేస్తున్నాను అని తెలిస్తే సీనియారిటీ చూపించి ఉండేదేమో అని నిరుపమ్ సరదాగా అన్నారు.

  అష్టా చమ్మా అలా తప్పిపోయింది

  అష్టా చమ్మా అలా తప్పిపోయింది

  ఇక అష్టా చమ్మ సినిమాలో హీరోగా అవకాశం తప్పిపోయిన అంశాన్ని కూడా ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. రేపు ఆడిషన్ ఉంటుందని చెబుతూ ఒక సీన్ కూడా తనకు రాసి ఇచ్చారని ఆడిషన్స్ జరగాల్సి ఉండగా ముందు రోజు సాయంత్రం సీరియల్ లో తనను చూసి ఆ సినిమాలో వద్దు అని చెప్పేశారని చెప్పుకొచ్చాడు. సీరియల్ లో చేస్తున్నారు కదా అవి చేసుకోమని అన్నారని నిరుపమ్ ఎమోషనల్ అయ్యాడు.

   పరిటాల రవి పేరు చెప్పడంతోనే

  పరిటాల రవి పేరు చెప్పడంతోనే


  ఇక పరిటాల రవి ప్రస్తావన అలీ తీసుకురావడంతో ఆ ఎపిసోడ్ కూడా చెప్పుకొచ్చాడు నిరుపమ్. ఇంద్ర రిలీజ్ సమయంలో తను థియేటర్ కి వెళ్తుంటే ఒక పోలీసు వచ్చి బండి తాళం లాక్కుని వెళ్లిపోయాడని, వెళ్లి ఫోన్ చేయమంటావా అని భయపెడితే ఎవరికీ అని అడిగాడనీ పరిటాల రవి గారికి అని చెప్పగానే అప్పటికప్పుడు తాళం విచ్చేసి తర్వాతి రోజు థియేటర్ టికెట్లు కూడా ఆయనే తీసుకువచ్చి ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇక మంజుల సైతం తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో నిజంగానే మీ కుటుంబానికి పరిటాల రవి కుటుంబానికి బంధుత్వం ఉందా అని అడిగితే తనకు రివర్స్ చేయడం రాకపోవడంతో రిలేషన్ ఉందని చెప్పానని, దీంతో వెంటనే లైసెన్స్ ఇష్యూ చేశారు అని చెప్పుకొచ్చింది.

  Adipurush Update : Kichcha Sudeep To Play Pivotal Role In Prabhas Adipurush
  చెప్పుల దండతో సన్మానం

  చెప్పుల దండతో సన్మానం


  ఇక ఒక సీరియల్ లో నటిస్తున్న నేపథ్యంలో తనకు అనేక బెదిరింపు కాల్స్ అలాగే బెదిరింపు మెయిల్స్ వచ్చేవని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. సీరియల్ లో తను చేస్తున్న పాత్రకు బాగా కనెక్ట్ అయిపోయిన కొందరు తనకు అనేకసార్లు ఫోన్లు చేసి భయపెట్టే వారిని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. చెప్పుల దండతో సన్మానం చేసి ఊరేగిస్తామని తనను భయపెట్టే వారిని ఆయన చెప్పుకొచ్చారు.. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ ప్రోమో మాత్రమే రిలీజ్ కాగా మరికొద్ది రోజుల్లో పూర్తి ఎపిసోడ్ రిలీజ్ కాబోతోంది.

  English summary
  Recently actor nirupam paritala appeared on alitho saradaga show. He and his wife Manjula appeared in the show. Interacted with the host Ali and revealed some interesting facts about his life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X