Karthika Deepam సంచలనం సృష్టించిన సీరియల్‌కి సీక్వెల్.. మళ్లీ వంటలక్క- డాక్టర్ బాబు వచ్చేస్తున్నారు!
ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ బుల్లితెరపై పాట వినపడితే ఆ గొంతుకతో కలిసి తమ గొంతును కలిపారు ప్రేక్షకులు. వంటలక్క ఏడిస్తే ఏడ్చారు, నవ్వితే నవ్వారు, కష్టసుఖాల్లో తన వెన్నంటే నిలిచారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లోనీ మగవాళ్లు కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. అంతలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబంలో ఉన్న మనుషుల గుండెల్లో పెనవేసుకుపోయిందీ సీరియల్.
వంటలక్కగా ప్రేమి విశ్వనాధ్, డాక్టర్ బాబుగా నిరుపమ్, ఇక మోనిత పాత్రలను ఏ ప్రేక్షకుడు ఎప్పటికి మర్చిపోలేరు. ఎందుకంటే వీళ్లు నటించలేదు, తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళ పాటు విజయవంతంగా సాగిన ఈ ధారావాహిక గతేడాది ఫిబ్రవరిలో ముగిసి ప్రతి అభిమానిని ఎంతో బాధపెట్టింది. అదే సమయంలో త్వరలోనే వస్తామంటూ ప్రకటించి వారిలో కాస్త ఆనందాన్ని నింపింది. దీంతో వారంతా సీజన్ 2 కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూడం ప్రారంభించారు.

అయితే ఎట్టకేలకు ఏడాది తర్వాత మళ్లీ గుడ్ న్యూస్‌తో వచ్చారు ఈ సీరియల్ మేకర్స్ స్టార్ మా వాళ్లు. వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు సిద్ధమైనట్లు ఓ వీడియోను విడుదల చేశారు. సీక్వెల్ తర్వలో ప్రారంభంకాబోతున్నట్లు తెలుపుతూ ఓ ప్రోమోను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. 40 సెకన్లు ఉన్న ఈ ప్రోమో ఆద్యంతం మనసును హత్తుకునేలా సాగింది. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన ఓ చిన్న పాప తన అమ్మ నాన్న కథ చెప్పబోతున్నట్లు తెలుపుతూ తన మాటలతో భావోద్వేగానికి గురి చేసింది.
నాకు చీకటంటే భయం. ఈ చీకట్లో నాకు ధైర్యం ఇచ్చే వెలుగే మా అమ్మ. కానీ కష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్కడున్నారో తెలీదు. అయినా అమ్మైనా నాన్నైనా మా అమ్మే. ఇంతకీ నా పేరు ఏంటో తెలుసా శౌర్య. ఇప్పుడు నేను చెప్పబోయేది మా అమ్మ నాన్న కథే అంటూ ఆ చిన్నారి మనసును తాకేలా చెప్పింది. అనంతరం.. తెలుగు లోగిళ్లు మరవని కథ. కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది. కార్తీక దీపం ఇదీ నవవసంతం. అంటూ ప్రోమోను ముగించారు మేకర్స్.
ఈ సీక్వెల్ వేలాది మంది బుల్లితెర ప్రేక్షకుల మొఖంపై కచ్చితంగా చిరునవ్వును తీసుకొస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహాం లేదు. అయితే మేకర్స్ ఈ సీరియల్ ఎవరెవరు నటిస్తున్నారు? ఎవరి పాత్ర ఏంటి? మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు ఇందులో నటిస్తారా? లేదంటే కొత్త వాళ్లతో తెరకెక్కిస్తున్నారా? అసలిదీ కొనసాగింపుగా రాబోతుందా? లేదంటో మరో కొత్త కథతో రాబోతుందా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే మిగతా వివరాలను తెలియజేస్తామని చెప్పారు. చూడాలి మరి ఎప్పుడు నుంచి ప్రసారమవుతుందో..
ఇకపోతే కార్తీకదీపం తొలి సీజన్ గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ ప్రపంచంలో సరికొత్త సునామినీ సృష్టించింది. ఊహించని స్థాయిలో ప్రతి ఎపిసోడ్‌కు అద్భుతమైన రేటింగ్స్‌ను అందుకుంటూ దూసుకెళ్లింది. గడిచిన మూడేళ్లలో(2023 కాకుండా) అత్యధిక స్థాయిలో TRP అందుకున్న ఏకైక సీరియల్‌గానూ నిలిచింది. చూడాలి మరి ఈ రెండో సీజన్ కూడా తొలి సీజన్ స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేస్తుందో లేదో...


Click it and Unblock the Notifications











