Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్ బాస్ కు వెళ్లడమే పొరపాటు- పునర్నవి
బిగ్ బాస్ షో, ఓ వర్గం వారు దీన్నో కాంట్రావర్షియల్ ప్రోగ్రామ్ గా చూస్తారు, మరికొందరికి అది ఫుల్ టూ ఎంటర్టైన్మెంట్, ఇకొందరికి అదో సెకండ్ ఛాన్..! ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాక, ఎంతోమంది యాక్టింగ్ కెరీర్ బౌన్స్ బ్యాక్ అయింది. కానీ, దీనివల్ల తనకు ఏమీ ఒరగలేదని స్పష్టం చేసేసింది, తెలుగింటి బొండుమల్లి పునర్నవీ భూపాలం.
బిగ్ బాస్ సీజన్ 3లో పాలుపంచుకున్న పునర్నవి, కొన్నివారాలపాటూ బాగానే నెట్టుకు వచ్చేసింది. త్వరగానే ఎలిమినేషన్ కు గురైనప్పటికీ, రాహుల్ సిప్లిగంజ్ తో అమ్మడి కెమిస్ట్రీ బాగానే పండిందని చెప్పాలి. తరువాత కూడా ఇద్దరూ కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ కొంతకాలం బాగానే హడావిడి చేశారు.
అయితే తాజాగా ఈ కార్యక్రమం వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు అంటూ అమ్మడు స్పష్టం చేసింది. అంతేకాదు, ఇందులో పాలుపంచుకోవడం వల్ల తన కెరీర్ మరింత డ్యామేజ్ అయిందని వెల్లడించింది. ఈమేరకు ఓ ప్లకార్డ్ ద్వారా తాను చెప్పదలచుకుంది స్పష్టంగా చెప్పేసింది. బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నావు పున్ను అని రాసి ఉన్న ప్లకార్డ్ ను ఒకరు డిస్ప్లే చేయగా, పునర్నవి బిగ్ బాస్ కు వెళ్లకూడదు అని ఉన్న ప్లకార్డ్ ను ప్రదర్శించింది.
మరోవైపు పునర్నవికి లీడ్ యాక్టర్ గా మరో అవకాశం లభించింది. హిందీలో సూపర్ పాపులర్ అయిన పర్మనెంట్ రూమ్మేట్స్ ను తెలుగులో రీమేక్ చేస్తుండగా, ఇందులో పునర్నవి మెయిన్ లీడ్ గా ఎంపికైందట. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో చికాగో సుబ్బారావు ఫేమ్ రాజ్ సంపర మేల్ లీడ్ గా నటిస్తున్నాడు. మరి ఈ వెబ్ సిరీస్ అయినా పునర్నవికి ఆశించిన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.